2019 ప్రపంచకప్‌లో పరాజయం పొందటం జట్టును కలచివేసిందని టీమ్ఇండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ అన్నాడు. గ్రూప్ దశలో అత్యుత్తమ ప్రదర్శన తర్వాత సెమీస్‌లో వెనుదిరిగిన పరిస్థితి మమ్మల్ని ఇప్పటికీ వెంటాడుతోందని తెలిపాడు. ఇటీవలే ఓ ఆన్లైన్ చాట్ సెషన్లో పాల్గొన్న రాహుల్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
గతంలో ఏదైనా మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం వస్తే ఏంచేస్తావు? అని రాహుల్‌ను అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు.
"అది కచ్చితంగా ప్రపంచకప్ సెమీఫైనల్‌ను మార్చాలనుకుంటున్నాను. కొన్నిసార్లు అది జట్టును ఇప్పటికీ వెంటాడుతోంది. గ్రూప్ దశలో ఉత్తమంగా ఆడినా.. సెమీస్‌లో వెనుదిరగటం బాధాకరంగా ఉంది. నేను ఇప్పటికీ కొన్నిసార్లు ఆ పీడకల నుంచి మేల్కొంటాను".
-- కెఎల్ రాహుల్, టీమ్ఇండియా ఓపెనర్
కరోనా లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం ఇతర క్రీడాకారుల మాదిరిగానే ఆట నుంచి విశ్రాంతి తీసుకుంటూనే ఆటపై కొంత హోంవర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. 2019 ప్రపంచకప్ గ్రూప్ దశలో భారత్ అత్యంత ఆధిపత్యం కొనసాగిస్తూ.. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో సహా అన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అవరోధాలను అవలీలగా దాటుకొని సెమీస్‌కు చేరిన టీమ్ఇండియా 18 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై పరాజయం చవిచూసింది.
ఇదీ చూడండి.. సెంచరీలు సాధించిన బ్యాట్లు వేలానికి!