ETV Bharat / sports

'ఆ ముగ్గురు దిగ్గజాలను చూస్తుండిపోయా' - 2007 వన్డే ప్రపంచకప్ తమీమ్ ఇక్బాల్

2007 ప్రపంచకప్​లో భారత్​తో జరిగిన లీగ్​ మ్యాచ్​కు సంబంధించిన విశేషాలను తాజాగా ఓ చాట్​ షోలో పంచుకున్నాడు బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్. ఆ రోజు తన ఆరాధ్య క్రికెటర్లు ద్రవిడ్, సచిన్, గంగూలీలను అలా చూస్తుండిపోయానని చెప్పాడు.​

'ఆ ముగ్గురు దిగ్గజాలను చూస్తుండిపోయా'
బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్
author img

By

Published : Jun 5, 2020, 2:55 PM IST

అది 2007 వన్డే ప్రపంచకప్‌. అప్పటికి పసికూనగా పేరున్న బంగ్లాదేశ్‌.. లీగ్‌ దశలో టీమ్‌ఇండియాను ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఘోర పరాభవంతో భారత్‌ ఆ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో బంగ్లాకు భారత్‌పై అదే తొలి విజయం. గ్రూప్‌ బీలో భారత్ ‌X బంగ్లా తలపడిన ఆ మ్యాచ్‌.. టీమ్‌ఇండియా అభిమానులకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోగా.. బంగ్లా అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత జట్టును ఆ పసికూన ఓడిస్తుందని కలలోనైనా ఎవరూ ఊహించలేదు. గంగూలీ, సెహ్వాగ్‌, సచిన్‌, ద్రవిడ్‌, యువరాజ్‌ సింగ్‌, ధోనీ లాంటి మేటి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా మంచి స్కోర్‌ చేయకపోవడం వల్ల బంగ్లా సునాయాస విజయం సాధించింది.

ఆ ముగ్గురు ఆరాధ్య క్రికెటర్లు..

ఆ మ్యాచ్‌లో బంగ్లా ఓపెనర్‌గా బరిలోకి దిగిన తమీమ్ ‌ఇక్బాల్‌(51) అర్ధ శతకం సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా అతడు ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోలో సంజయ్‌ మంజ్రేకర్‌తో మాట్లాడుతూ నాటి విశేషాలు పంచుకున్నాడు. భారత క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్లైన సచిన్‌‌, ద్రవిడ్‌, గంగూలీ.. ఈ ముగ్గురు తన ఆరాధ్య క్రికెటర్లని తమీమ్‌ ఈ సందర్భంగా చెప్పాడు.

Was too busy watching Sachin, Ganguly: Tamim Iqbal
ద్రవిడ్, సచిన్, గంగూలీల గురించి చెప్పిన తమీమ్ ఇక్బాల్

'ఆ మ్యాచ్‌లో నా అభిమాన ఆటగాళ్లు సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీని అలాగే చూస్తుండిపోయా. వాళ్లను తదేకంగా గమనించా. ఆ ముగ్గురు దిగ్గజాల సమక్షంలో ఆడడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది' అని తమీమ్‌ పేర్కొన్నాడు.

జహీర్‌ బౌలింగ్‌ ఎదుర్కోగలనా అనిపించింది..

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 49.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. గంగూలీ(66), యువీ(47) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. దీంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అనంతరం బంగ్లా 48.3 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. ఓపెనర్‌ తమీమ్‌(51), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌(56), మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌(53) అర్ధ శతకాలతో రాణించడం వల్ల ఆ జట్టు గెలుపొందింది.

"అప్పుడు భారత్‌ 191 పరుగులే చేయడం వల్ల మేం గెలుస్తామనే నమ్మకం కలిగింది. నేను ఓపెనర్‌గా దిగేసరికి జహీర్‌ఖాన్‌ బంతిని అందుకున్నాడు. దాంతో నేను.. '140 కిమీ వేగంతో బంతులేసే బౌలర్‌ను ఎదుర్కోగలనా' అని మనసులో అనుకున్నా. జహీర్‌ తొలి బంతి వేయగానే ఏదోలా మేనేజ్‌ చేశా. తర్వాతి బంతికే ఫోర్‌ కొట్టడం వల్ల నాకు నమ్మకం కలిగింది. ఇక టీమ్‌ఇండియా దిగ్గజాలతో కలిసి ఆడడం సంతోషంగా అనిపించింది" అని తమీమ్‌ వివరించాడు. ఇక భారత్‌పై ఆ విజయం బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో గొప్ప విశేషమని, ఆ విజయంతో బంగ్లా అభిమానులకు తమ జట్టుపై నమ్మకం కలిగిందని గుర్తుచేసుకున్నాడు.

ఇది చదవండి: స్వదేశీ క్రికెటర్లతోనే ఐపీఎల్-2020​ జరిగితే..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.