ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు చిత్రాలకు ఫిదా అయినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఇతడు టాలీవుడ్ సినిమా పాటలు, డైలాగ్స్‌కు టిక్‌టాక్ చేసి అలరిస్తున్నాడు. తన సతీమణి క్యాండిస్, కుమార్తె కూడా ఇందులో కనిపించడం విశేషం. 'అల వైకుంఠపురములో..'లోని 'బుట్టబొమ్మ', 'రాములో రాములా' పాటలకు వార్నర్ ఇప్పటికే చిందేశాడు. 'పోకిరి' సినిమాలో మహేశ్‌బాబు ఫేమస్ డైలాగ్ 'ఒక్కసారి కమిట్ అయితే..' చెప్పి ఆకట్టుకున్నాడు. తాజాగా అమరేంద్ర బాహుబలి అవతారం ఎత్తాడు.
'అమరేంద్ర బాహుబలి అను నేను..' అంటూ అలరించాడు వార్నర్. "ఈ సినిమా పేరు చెప్పండి చూద్దాం" అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">