ETV Bharat / sports

ఐపీఎల్​ కోసం కోహ్లీ కొత్త అస్త్రాలు సిద్ధం - కోహ్లీ ఐపీఎల్ 2020

ఐపీఎల్​ కోసం కోహ్లీ కొత్త కిట్​ సిద్ధమైపోయింది. ఈ విషయమై ట్వీట్ చేసిన ఆర్​సీబీ.. కెప్టెన్ ఆయుధాలు వచ్చేశాయని పేర్కొంది.

ఐపీఎల్​ కోసం కోహ్లీ కొత్త అస్త్రాలు సిద్ధం
కోహ్లీ
author img

By

Published : Aug 2, 2020, 5:41 AM IST

ఐపీఎల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడి కొత్త కిట్​ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్ చేశాడు. ఇదే విషయాన్ని చెబుతూ.. కెప్టెన్ కోహ్లీ ఆయుధాలు వచ్చేశాయని ఆర్​సీబీ ట్వీట్ చేసింది.

Virat Kohli flaunts new kit
కోహ్లీ కొత్త కిట్

కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఐపీఎల్​ను యూఏఈలో నిర్వహించనున్నారు. సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వ తేదీ వరకు జరగనుంది.

ఇప్పటివరకు జరిగిన 12 సీజన్లలో బెంగళూరు జట్టు ఒక్కసారైనా కప్పు గెలుచుకోలేకపోయింది. ఈసారి మాత్రం ఎలాగైనా సరే విజేతగా నిలవాలని భావిస్తోంది. మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇదే చెప్పాడు. యూఏఈ పిచ్​లు ఆర్​సీబీ బౌలర్లకు బాగా ఉపకరిస్తాయని అన్నాడు. ఈ జట్టుకే కప్పు గెలిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.