భారత మహిళల క్రికెట్ జట్టు మరోసారి అదరగొట్టింది. శుక్రవారం వడోదరలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.
కెప్టెన్ మిథాలీరాజ్ (66)తో పాటు పూనమ్ రావత్ (65) అర్ధశతకాలతో సత్తాచాటారు. లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 48వ ఓవర్లోనే ఛేదించింది. చివర్లో హర్మన్‌ప్రీత్(39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేశారు. లిజెల్లీ (40), వోల్వార్ట్ (69), డుప్రీజ్ (44) రాణించారు. భారత బౌలర్లలో శిఖా పాండే, ఏక్తా బిష్ఠ్, పూనమ్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇది చదవండి: క్రికెట్ మహారాణి 'మిథాలీ రాజ్' 20 ఏళ్ల ప్రస్థానం