ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్: చెపాక్ బంతి ఎవరి చేతికో? - మహ్మద్ సిరాజ్

ఇంగ్లాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం టీమ్ఇండియా నెట్స్​లో శ్రమిస్తోంది. అయితే తుదిజట్టు కూర్పులో మాత్రం మేనేజ్​మెంట్​కు తలనొప్పి తగ్గేలా లేదు. బౌలింగ్ విషయానికొస్తే ఎవరిని తీసుకోవాలనే విషయంలో సందిగ్ధంలో పడింది బోర్డు. ఓవైపు అనుభవం, మరోవైపు యువ సత్తాతో కూడిన బౌలర్లలో మేటి ఆటగాళ్లను ఎంచుకోవడం కాస్త కష్టమే.

Team India management confusing between bowling options
చెపాక్ బంతి ఎవరి చేతికో
author img

By

Published : Feb 3, 2021, 9:00 AM IST

ఇంగ్లాండ్‌తో భారత జట్టు ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌ ఆరంభానికి ఇంకో రెండు రోజులే సమయం ఉంది. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి టెస్టు సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో ఇంగ్లాండ్‌ పోరును ఆరంభించనుంది టీమ్‌ఇండియా. కంగారూ గడ్డపై అద్భుత విజయంలో బౌలర్ల పాత్ర ఎంతో కీలకం. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను గెలవాలన్నా ప్రతి మ్యాచ్‌లో 20 వికెట్లు తీయడం తప్పనిసరి. అయితే సిరీస్‌ ముంగిట తుది జట్టు ఎంపికలో, ముఖ్యంగా బౌలింగ్‌ దళంలో ఎవరుండాలనే విషయంలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పి తప్పేట్లు లేదు.

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడాలంటే ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా కచ్చితంగా గెలవాల్సిందే. కీలక ఆటగాళ్లు లేకుండానే ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించిన జట్టుకు.. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌ను ఓడించడం ఓ లెక్కా అనిపించొచ్చు. కానీ అన్నిసార్లూ పరిస్థితులు కలిసి రావు. అంచనాలకు తగ్గట్లు సిరీస్‌లు సాగవు. 2012లో ఇలాగే ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేస్తే ఆ జట్టు సిరీస్‌ ఎగరేసుకుపోయింది. కాబట్టి మేటి ఆటతీరుతో ఇంగ్లిష్‌ జట్టును ఆరంభం నుంచి కుదురుకోనివ్వకుండా చేయాల్సిందే. కెప్టెన్‌ రూట్‌ సహా కొందరు మేటి, ప్రమాదకర బ్యాట్స్‌మెన్‌ ఉన్నారు ఆ జట్టులో. వారిని దెబ్బ తీయాలంటే మంచి బౌలింగ్‌ దళముండాలి. అయితే షమీ, జడేజా గాయాల కారణంగా దూరం కావడం బౌలింగ్‌ సమతూకాన్ని దెబ్బ తీస్తోంది. స్వదేశంలో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ సరిపోతారనే ఉద్దేశంతో చెపాక్‌లో విరాట్‌ అయిదుగురు బౌలర్ల కూర్పుకే ఓటేసే అవకాశముంది. వికెట్‌ కీపర్‌గా పంత్‌ ఉంటే మరో ఆలోచనకు ఆస్కారం ఉండదు. సాహాను తీసుకుంటే మాత్రం అదనపు బ్యాట్స్‌మన్‌ కోసం చూడొచ్చు. అలాంటపుడు నలుగురు బౌలర్లనే ఎంచుకునే అవకాశముంది.

Ishant
ఇషాంత్ శర్మ

ఆ ఇద్దరూ ఖాయం

బౌలింగ్‌ దళంలో కచ్చితంగా ఉంటారని అంచనా వేయగల ఆటగాళ్లు ఇద్దరు.. ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. మిగతా ఇద్దరు లేదా ముగ్గురు బౌలర్లెవరన్నదే ఇప్పుడు ప్రశ్న. తుది జట్టులో ముగ్గురు పేసర్లుండాలనుకుంటే ఇషాంత్‌ శర్మతో పాటు ఆస్ట్రేలియాలో ఆకట్టుకున్న మహ్మద్‌ సిరాజ్‌ను ఎంచుకోవచ్చు. పేసర్లు ఇద్దరే అయితే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరం. అనుభవం ప్రకారం చూస్తే ఇషాంత్‌కే ఓటేయాలి. అయితే అతను ఫిట్‌నెస్‌ సమస్యలతో చాలా కాలం ఆటకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు అత్యుత్తమ స్థాయిలో బౌలింగ్‌ చేయగలడా అన్నది ప్రశ్న. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే సిరాజ్‌కు అవకాశం దక్కాలి. అయితే ఆస్ట్రేలియాలో పేస్‌ పిచ్‌లపై సత్తా చాటిన సిరాజ్‌.. చెన్నైలో స్పిన్‌కు పేరు పడ్డ చెపాక్‌లో ఏమేరకు రాణిస్తాడో అన్న సందేహాలున్నాయి. బ్యాటింగ్‌ కూడా చేయగల మీడియం పేసర్‌ కావాలనుకుంటే శార్దూల్‌ రూపంలో మరో ప్రత్యామ్నాయముంది.

sunder
సుందర్

ఇక స్పిన్‌ విభాగం విషయానికొస్తే.. అశ్విన్‌కు తోడుగా మరొకరు తుది జట్టులో ఖాయం. బౌలింగ్‌లో వైవిధ్యం, అనుభవం ప్రాతిపదిక అయితే చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌కు అవకాశం ఇవ్వొచ్చు. అయితే చైనామన్‌ శైలి వల్ల అశ్విన్‌కు తోడుగా మరో ఆఫ్‌స్పిన్నర్‌ ఉన్నట్లుంటుంది. అలాంటపుడు జడేజా స్థానాన్ని భర్తీ చేయగల అక్షర్‌ పటేల్‌ను ఎంచుకోవచ్చు. అతను బ్యాటింగ్‌ కూడా చేయగలడు. జడేజా స్థానాన్ని భర్తీ చేయడానికి అతనే సరైనవాడు కూడా. అలాగే ఆస్ట్రేలియాలో ఆకట్టుకున్న వాషింగ్టన్‌ సుందర్‌ రూపంలో మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. అతనూ బ్యాటుతో సత్తా చాటగలవాడే. చెన్నై పిచ్‌పై పచ్చిక తొలగించి స్పిన్‌కు అనుకూలంగా తీర్చిదిద్దితే.. పేసర్లను ఇద్దరికి పరిమితం చేసి, అశ్విన్‌కు తోడుగా పై ముగ్గురిలో ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకోవచ్చు. కానీ పేస్‌తో పాటు స్పిన్‌కు సమానంగా సహకరించేలా చెపాక్‌ పిచ్‌ తయారవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి బౌలింగ్‌ దళం విషయంలో కోహ్లీ, రవిశాస్త్రి ఎంపిక ఎలా ఉంటుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.