న్యూజిలాండ్, భారత్ మధ్య టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్ వేదికగా మొదటి టీ20 శుక్రవారం ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కివీస్ వెళ్లిన కోహ్లీ సేన... బుధవారం సరదాగా గడిపింది. గురువారం మాత్రం యథావిధిగా నెట్స్‌లో కఠిన సాధన చేసింది. ఆటగాళ్లంతా అక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు ప్రయత్నించారు. అయితే ఆస్ట్రేలియా సిరీస్‌లో కీపింగ్ చేసిన కేఎల్ రాహులే న్యూజిలాండ్‌తో టీ20లకు కీపింగ్ చేసే అవకాశాలున్నాయి.
బీసీసీఐ ట్వీట్...
భారత జట్టు కోచ్‌ల నేతృత్వంలో రాహుల్... గురువారం కీపింగ్ సాధన చేశాడు. యువ పేసర్ నవదీప్ సైనీ, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కష్టపడ్డాడు. వారిద్దరూ చురకత్తుల్లాంటి బంతులు సంధించారు. వికెట్లను నేరుగా గురిచూస్తూ పదునైన యార్కర్లు విసిరారు. ఆ బంతులను రాహుల్ అందుకొనే ప్రయత్నం చేశాడు. సాధనలో అతడు ఎంతో ఉల్లాసంగా కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది. "కేఎల్ రాహుల్ నీ కీపింగ్ గ్లోవ్స్ సిద్ధం చేసుకున్నావా?" అనే కామెంట్‌నూ జత చేసింది.
-
Getting your keeping gloves ready @klrahul11? 👐👌🏻😃 #TeamIndia #NZvIND 🇮🇳🇳🇿 pic.twitter.com/g3EnlmdsWV
— BCCI (@BCCI) January 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Getting your keeping gloves ready @klrahul11? 👐👌🏻😃 #TeamIndia #NZvIND 🇮🇳🇳🇿 pic.twitter.com/g3EnlmdsWV
— BCCI (@BCCI) January 23, 2020Getting your keeping gloves ready @klrahul11? 👐👌🏻😃 #TeamIndia #NZvIND 🇮🇳🇳🇿 pic.twitter.com/g3EnlmdsWV
— BCCI (@BCCI) January 23, 2020
కోహ్లీ ప్రశంసలు...
"రాహుల్ జట్టు మనిషి. టీమిండియా కోసం అతడు ఏ పాత్ర ఇచ్చినా చేసేందుకు సిద్ధంగా ఉంటున్నాడు. ఆసీస్ సిరీస్‌లో కీపింగ్‌లో రాణించాడు. అందువల్లే అదనపు బ్యాట్స్‌మన్ రూపంలో జట్టుకు మేలు జరుగుతోంది. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా" అని కెప్టెన్ కోహ్లీ ఇటీవల మీడియా సమావేశంలో చెప్పాడు.
రాహుల్ కీపింగ్ బాధ్యతలు తీసుకుంటే యువ కీపర్లు రిషభ్ పంత్, సంజు శాంసన్ల స్థానాలకు ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది.
జనవరి 24న న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. అనంతరం మూడు వన్డేలు, రెండు టెస్టులూ జరగనున్నాయి.
భారత్ టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్(కీపర్), శివమ్ దూబే, సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్
న్యూజిలాండ్ టీ20 జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, టామ్ బ్రూస్, కొలిన్ డీ గ్రాండ్‌హోమ్, మార్టిన్ గప్తిల్, స్టాట్ కుగ్గెలిజిన్, డారిల్ మిచెల్, కొలిన్ మున్రో, రాస్ టేలర్, బ్లెయర్ టిక్నర్, మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెట్, ఇష్ సోధి, టిమ్ సౌథి.