ETV Bharat / sports

హజారే ట్రోఫీ తమిళనాడు జట్టులో నట్టూ

విజయ్​ హజారే ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​ జట్టును ప్రకటించింది. అందులో యువ పేసర్​ తంగరసు నటరాజన్​కూ చోటు కల్పించింది. కానీ తుది టీమ్​లో ఆడించే విషయంపై మాత్రం బీసీసీఐ అనుమతి కోరినట్లు టీఎన్​సీఏ స్పష్టం చేసింది.

Tamil Nadu include Natarajan in Vijay Hazare Trophy squad
హజారే ట్రోఫీ- తమిళనాడు స్క్వాడ్​లో నట్టూకు చోటు
author img

By

Published : Feb 4, 2021, 11:08 AM IST

రాబోయే విజయ్​ హజారే ట్రోఫీ పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో యువ పేసర్​ నటరాజన్​కు చోటు కల్పించింది తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​(టీఎన్​సీఏ). భారత సీనియర్​ ప్లేయర్​ దినేశ్​ కార్తీక్​ను సారథిగా నియమించగా.. బాబా అపరాజిత్​కు వైస్​ కెప్టెన్సీ అప్పగించింది.

ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్​తో జరగబోయే తొలి రెండు టెస్టుల భారత జట్టులో ఈ యువ లెఫ్టార్మ్​ పేసర్​కు స్థానం కల్పించలేదు యాజమాన్యం. దీంతో తమిళనాడు జట్టులో చోటు కల్పించినట్లు టీఎన్​సీఏ తెలిపింది. అతడిని ఆడించే విషయంపై బీసీసీఐ అనుమతి కోరినట్లు పేర్కొంది. ఇంగ్లాండ్​తో జరుగబోయే టీ20, వన్డే సిరీస్​లకు ఈ ట్రోఫీ నటరాజన్​కు ఉపయుక్తంగా ఉంటుందని వెల్లడించింది.

ఆస్ట్రేలియా పర్యటనలో రాణించిన నట్టూ.. ఒకే టూర్​లో మూడు ఫార్మాట్లలోనూ అరంగ్రేటం చేసిన మొదటి భారత క్రికెటర్​గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: 'పాక్​తో సిరీస్​ అనంతరం కెప్టెన్​ మార్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.