ETV Bharat / sports

ఆస్ట్రేలియాతో టెస్టులకు నటరాజన్ ఎంపిక

వన్డే, టీ20 సిరీస్​లో ఆకట్టుకున్న యార్కర్ స్పెషలిస్టు టి.నటరాజన్.. టెస్టు సిరీస్​కు ఎంపికయ్యాడు. చివరి రెండు మ్యాచ్​ల్లో ఉమేశ్ యాదవ్ స్థానంలో బరిలో దిగనున్నాడు.

author img

By

Published : Jan 1, 2021, 2:21 PM IST

T Natarajan to replaces Umesh Yadav in India's Test squad against Australia
ఆస్ట్రేలియా టెస్టులకు నటరాజన్ ఎంపిక

భారత యువ పేసర్ టి.నటరాజన్.. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. ఇటీవల గాయపడిన ఉమేశ్ యాదవ్ స్థానంలో అతడు చోటు దక్కించుకున్నాడు. జనవరి 7 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది.

వన్డే సిరీస్​ను 1-2 తేడాతో కోల్పోయిన టీమ్​ఇండియా, టీ20 సిరీస్​ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. చివరి వన్డేతో పాటు పొట్టి ఫార్మాట్​లో మూడు మ్యాచ్​లు ఆడిన నట్టు.. తన యార్కర్లు, అద్భుత బౌలింగ్​తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం నెట్​ బౌలర్​గా ఉన్న తను.. ఉమేశ్​ గాయపడటం వల్ల జట్టులోకి వచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.