క్రికెట్లో ఆవలింత అంటే టక్కున గుర్తొచ్చే పేరు పాక్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్. గతేడాది ప్రపంచకప్‌లో భారత్‌తో లీగ్ మ్యాచ్ సందర్భంగా కీపింగ్ చేస్తూ ఆవలిస్తూ కనిపించాడు. దాంతో అతడిపై విపరీతంగా ట్రోల్స్, మీమ్స్ సందడి చేశాయి. ఇతరుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్మిత్, డ్రస్సింగ్ రూమ్‌లో కూర్చొని ఆవలిస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఆ ఫొటోను సర్ఫారాజ్ భార్య ట్వీట్ చేయడం విశేషం. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 సందర్భంగా ఇది జరిగింది.
లెజెండ్స్ అలానే ఉంటారు
ఇంగ్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో కెమెరా డ్రస్సింగ్ రూమ్‌వైపు తిప్పారు. సరిగ్గా ఆ సమయంలో ఆవలిస్తూ కనిపించాడు స్మిత్. అది కాస్త వైరల్‌గా మారి మీమ్స్ సందడి చేశాయి. అయితే ఈ విషయంలో అతడికి మద్ధతుగా నిలిచింది సర్ఫారాజ్ భార్య. దిగ్గజాలు ఇలానే ఉంటారనే వ్యాఖ్యను జోడించి, ఆ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ టీ20లో రెండు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది.
-
Legends be like 🙌🏻🤪💃🏻 pic.twitter.com/DvGIYZ7Gyq
— Khushbakht Sarfaraz (@sarfarazkhush) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Legends be like 🙌🏻🤪💃🏻 pic.twitter.com/DvGIYZ7Gyq
— Khushbakht Sarfaraz (@sarfarazkhush) September 5, 2020Legends be like 🙌🏻🤪💃🏻 pic.twitter.com/DvGIYZ7Gyq
— Khushbakht Sarfaraz (@sarfarazkhush) September 5, 2020
ఆవలింత పాపం కాదు!
ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు, టీ20 మ్యాచ్‌ల సందర్భంగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ ఆవలిస్తూ కెమెరాకు చిక్కాడు. దీంతో మరోసారి విమర్శలు ఎదుర్కొన్నాడు. క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో ఆవలిస్తూ కనిపించిన క్రికెటర్ ఇతడేనంటూ సర్ఫరాజ్‌పై మీమ్స్, ట్రోలింగ్ చేస్తున్నారు. "ఆవలించడం సాధారణ విషయం. నేనేం పాపం చేయలేదు. నా ఆవలింత ద్వారా ప్రజలు డబ్బు సంపాదిస్తే అదే మంచి విషయం" అని గతంలోనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు సర్ఫరాజ్.