ETV Bharat / sports

పాక్​ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టుకు కరోనా నెగెటివ్​ - పాక్​ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టుకు కరోనా నెగెటివ్​

పద్నాలుగేళ్ల తర్వాత తొలిసారి సిరీస్​ ఆడేందుకు పాకిస్థాన్​లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టుకు చేసిన తొలి రౌండ్ కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది. దీంతో అందరూ తొలి ట్రైనింగ్​ సెషన్​లో పాల్గొననున్నారు. వీరికి మరో రెండు రోజుల్లో ​రెండో రౌండ్​ పరీక్షలు నిర్వహిస్తారు.

south
దక్షిణా
author img

By

Published : Jan 18, 2021, 8:57 AM IST

దాదాపు 14 ఏళ్ల తర్వాత క్రికెట్‌ సిరీస్‌ ఆడేందుకు శనివారం పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన దక్షిణాఫ్రికా జట్టు దిగ్విజయంగా తొలి రౌండు కరోనా నిర్ధరణ పరీక్షలు పూర్తిచేసుకుంది. అక్కడికి చేరుకున్న 21మంది ఆటగాళ్లు సహా సహాయక సిబ్బందికి నెగెటివ్​గా రిపోర్ట్స్​ వచ్చాయి. దీంతో వీరంతా తొలి ట్రైనింగ్​ సెషన్​లో పాల్గొననున్నారు.

అయితే వీరందరికీ మరో రెండు రోజుల్లో రెండో రౌండ్​ వైరస్​ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులోనూ నెగెటివ్​గా తేలితేనే మ్యాచ్​ల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

చివరగా 2007లో పాక్‌ గడ్డపై ఆడిన టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో గెలిచింది. ఇన్నేళ్ల తర్వాత రెండు టెస్టులతో పాటు మూడు టీ20లు ఆడేందుకు అక్కడికి చేరుకుంది. ఈ నెల 26-30, వచ్చే నెల 4-8 తేదీల నడుమ ఈ టెస్టులు జరగనున్నాయి. టీ20 సిరీస్‌ ఫిబ్రవరి 11న ఆరంభం కానుంది.

2009లో స్వదేశంలో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసినప్పటి నుంచి.. సొంతగడ్డపై ఆడాల్సిన సిరీస్‌లను తటస్థ వేదికైన యూఏఈలో ఆడుతోంది పాక్. తిరిగి తమ దేశంలో క్రికెట్‌కు ప్రాణం పోసేందుకు పాక్‌ క్రికెట్‌ బోర్డు చేస్తున్న ప్రయత్నాలకు ఈ మధ్య వివిధ జట్లు సాయం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆ దేశానికి వెళ్లేందుకు సఫారీ సేన అంగీకరించింది.

ఇదీ చూడండి: 14 ఏళ్ల తర్వాత.. పాక్‌ పర్యటనకు దక్షిణాఫ్రికా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.