ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీపై స్లెడ్జింగ్(దూషణ) చేయొద్దని తమ దేశ ఆటగాళ్లకు మాజీ క్రికెటర్ స్టీవ్ వా సూచించాడు. అలా చేస్తే విరాట్ మరిన్ని పరుగులను చేసే అవకాశముందని హెచ్చరించాడు. తనను తాను నియంత్రించకోవడంలో కోహ్లీ చాలా మెరుగయ్యాడని అభిప్రాయపడ్డాడు.
"స్లెడ్జింగ్ కోహ్లీని ఏం చేయలేదు. అతడిలాంటి గొప్ప ఆటగాళ్లపై ఇది ఏ మాత్రం ప్రభావం చూపదు. అతడిని వదిలేయడమే ఉత్తమం. లేదంటే అది మరింత స్ఫూర్తిదాయకంగా మారుతుంది. తనను తాను నియంత్రించుకోవడంలో విరాట్ చాలా మెరుగయ్యాడు. గత సిరీస్లో స్మిత్ 300 పరుగుల్ని సాధించాడు. దాన్ని మనసులో పెట్టుకున్న కోహ్లీ.. ఈ సారి మరింత రెచ్చిపోయి ఆడే అవకాశముంది"
-- ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టీవ్ వా
గత ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్ టిమ్ పెయిన్, ఇతర ఆటగాళ్లు.. కోహ్లీపై స్లెడ్జింగ్ చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. 2016 నుంచి వరుసగా ఆస్ట్రేలియా సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది.
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ పూర్తయిన తర్వాత టీమ్ఇండియా.. నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టెస్టు, వన్డే, టీ20లు ఆడనుంది. నవంబర్ 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఇదీ చూడండి:ఆసీస్'తో పోలిస్తే భారత క్రికెటర్లకు విశ్రాంతి తక్కువే!