ETV Bharat / sports

న్యూజిలాండ్​లో పాక్​ పర్యటన- మాలిక్​ ఔట్​ - మొహమ్మద్​ అమీర్​ వార్తలు

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా పాకిస్థాన్​, న్యూజిలాండ్​ మధ్య ద్వైపాక్షిక సిరీస్​ జరగనుంది. ఈ పర్యటన కోసం 35 మంది ఆటగాళ్లతో కూడిన పాకిస్థాన్ జట్టును పీసీబీ ప్రకటించింది. అయితే ఇందులో సీనియర్​ క్రికెటర్లు షోయబ్​ మాలిక్​, మహమ్మద్​ అమీర్​లకు చోటు దక్కలేదు. ఈ నెల 23న న్యూజిలాండ్​కు బయలుదేరనుంది పాకిస్థాన్​.

Shoaib Malik, Aamir left out of Pakistan's upcoming tour of NZ
షోయబ్ మాలిక్​
author img

By

Published : Nov 11, 2020, 9:25 PM IST

న్యూజిలాండ్​ పర్యటన కోసం 35 మందితో కూడిన పాకిస్థాన్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. అందులో ఆల్​రౌండర్ షోయబ్​ మాలిక్​, పేసర్​ మహమ్మద్​ అమీర్​లకు స్థానం కల్పించలేదు. యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారిని సెలెక్ట్​ చేయలేదని పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా న్యూజిలాండ్-పాకిస్థాన్​ మధ్య వచ్చే నెలలో టెస్టు సిరీస్​ జరగనుంది. దాని కంటే ముందుగా డిసెంబరు 18, 20, 22 తేదీల్లో ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్​లను నిర్వహించనున్నారు. నవంబరు 23న కివీస్​ పర్యటనకు పాక్​ జట్టు బయలుదేరనుంది.

పాకిస్థాన్​ టెస్టు జట్టుకు కెప్టెన్​గా బాబర్ అజామ్​ను మంగళవారం పీసీబీ నియమించగా.. వైస్​ కెప్టెన్​గా మొహమ్మద్​ రిజ్వాన్​ను ఎంపిక చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయో-బబుల్​ను ఏర్పాటు చేసి కివీస్​, పాక్​ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్​ను నిర్వహించనున్నారు.

Shoaib Malik, Aamir left out of Pakistan's upcoming tour of NZ
మహమ్మద్​ అమీర్​

స్క్వాడ్​:

ఓపెనర్లు: అబిద్​ అలీ, ఇమామ్​ ఉల్​ హక్​, అబ్దుల్లా షఫీక్​, షాన్​ మసూద్​, ఫఖర్​ జమాన్​, జీషన్ మాలిక్​.

మిడిల్​ఆర్డర్​ బ్యాట్స్​మెన్​: బాబర్​ ఆజామ్​ (కెప్టెన్​), అజార్​ అలీ, ఫవాద్​ ఆలం, హుస్సేన్​ తాలత్​, హైదర్​ అలీ, ఇమ్రాన్​ భట్​, హరిస్​ సోహైల్​, ఇఫ్తికర్​ అహ్మద్​, మొహమ్మద్​ హఫీజ్​, కుష్​దిల్​ షా, దానిష్​ అజీజ్​.

వికెట్​ కీపర్లు: ముహమ్మద్​ రిజ్వాన్​, సర్ఫరాజ్​ అహ్మద్​, రోహైల్​ నజీర్​.

స్పిన్నర్లు: ఇమాద్ వసీమ్​, షాదాబ్​ ఖాన్​, ఉస్మాన్​ ఖాదిర్​, యాసిర్​ షా, జాఫర్​ గోహర్​.

ఫాస్ట్​ బౌలర్లు: అమద్​ భట్​, ఫహీమ్​ అష్రఫ్​, హారిస్​ రఫ్​, ముహమ్మద్​ మూస, ముహమ్మద్​ హస్నైన్​, ముహమ్మద్​ అబ్బాస్​, నసీమ్​ షా, షాహీన్​ షా అఫ్రిది, సోహైల్​ ఖాన్​, వహాబ్​ రియాజ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.