అనుకున్నట్లే జరిగింది.. గాయం కారణంగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దుల్ ఠాకుర్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ విషయాన్ని అధికారికంగా శనివారం ప్రకటించింది.
-
UPDATE 📰: @imShard to replace
— BCCI (@BCCI) December 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Bhuvneshwar Kumar in #TeamIndia squad for the @Paytm ODI series starting tomorrow in Chennai against the West Indies. #INDvWI
Details - https://t.co/bZyscTF1Dk pic.twitter.com/9ow10ojUti
">UPDATE 📰: @imShard to replace
— BCCI (@BCCI) December 14, 2019
Bhuvneshwar Kumar in #TeamIndia squad for the @Paytm ODI series starting tomorrow in Chennai against the West Indies. #INDvWI
Details - https://t.co/bZyscTF1Dk pic.twitter.com/9ow10ojUtiUPDATE 📰: @imShard to replace
— BCCI (@BCCI) December 14, 2019
Bhuvneshwar Kumar in #TeamIndia squad for the @Paytm ODI series starting tomorrow in Chennai against the West Indies. #INDvWI
Details - https://t.co/bZyscTF1Dk pic.twitter.com/9ow10ojUti
" రేపటి(ఆదివారం) నుంచి చెన్నై వేదికగా వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దుల్ ఠాకుర్‌ను ఎంపిక చేశాం" -బీసీసీఐ ట్వీట్
యాజమాన్యానికి ఫిర్యాదు..!
విండీస్‌తో నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్ తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని బీసీసీఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు భువీ. ఇటీవలే వెన్ను నొప్పి వల్ల మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. కోలుకుని ఒక సిరీస్ ఆడాడో లేదో మళ్లీ గాయం తిరగబెట్టింది.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్(కీపర్), శివమ్ దూబే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకుర్.
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది టీమిండియా. తొలి వన్డే చెన్నై వేదికగా డిసెంబరు 15న ప్రారంభం కానుంది. రెండో మ్యాచ్ విశాఖలో డిసెంబరు 18న జరగనుంది. మూడో వన్డే కటక్ వేదికగా డిసెంబరు 22న నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: 'ఆటను అర్థం చేసుకుంటే ఎందులోనైనా ఆడొచ్చు'