ETV Bharat / sports

తుపాన్ వచ్చినా ఆగని సచిన్ పరుగుల సునామీ

1998లో షార్జా వేదికగా జరిగిన కోకో కోలా కప్​ను గుర్తు చేసుకున్న సచిన్.. ఆస్ట్రేలియాతో మ్యాచ్​ విశేషాలను తాజాగా వెల్లడించాడు. అప్పుడే తొలిసారి తాను, ఇసుక తుపాన్​ను చూశానని అన్నాడు.

author img

By

Published : May 5, 2020, 1:08 PM IST

తుపాన్ వచ్చినా ఆగని సచిన్ పరుగుల సునామీ
సచిన్ తెందుల్కర్

సచిన్‌ తెందుల్కర్‌. క్రీడా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. మైదానంలోకి దిగితే పరుగుల వరద పారాల్సిందే. ప్రత్యర్థి బౌలర్‌ గుండెల్లో రైళ్లు పరిగెట్టాల్సిందే. అదే సమయంలో మైదానంలో మాస్టర్ చాలా కూల్‌గా ఉంటాడు. భావోద్వేగాలను అస్సలు కనపడనీయడు. ఎదుటి జట్టు నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా, ముఖంలో ప్రశాంతత కనపడుతుంది తప్ప, కోపం.. అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా అరుదు. అలాంటి సందర్భమే ఏప్రిల్‌ 22, 1998న షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కనిపించింది. అయితే, ఈ మ్యాచ్‌లో సచిన్‌ కాస్త ఆందోళనగా కనిపించాడు. ఆనాటి విశేషాలను తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పంచుకున్నాడు.

ఈ మ్యాచ్​లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌ 31 ఓవర్లకే 4 కీలక వికెట్లు కోల్పోయి 143 పరుగులతో ఉంది. అప్పుడు క్రీజులో ఉన్న సచిన్‌.. అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి 143 పరుగులు చేశాడు. మధ్యలో ఇసుక తుపాను రావడం వల్ల మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపి వేసి, లక్ష్యాన్ని రివైజ్డ్‌ చేశారు. 46 ఓవర్లలో 276 పరుగులగా మార్చారు. అయితే, ఇండియా 237 పరుగులు మాత్రమే చేసింది. అయినా, నెట్‌ రన్‌రేట్‌ కారణంగా ఫైనల్‌కు చేరడమే కాదు, ఫైనల్లో ఇదే ఆస్ట్రేలియాను ఓడించి కప్‌ కైవసం చేసుకుంది.

"ఇసుక తుపాను కారణంగా లక్ష్యాన్ని సవరించారు. అప్పుడంతా డ్రెస్సింగ్‌ రూమ్‌లో దాని గురించి చర్చిస్తున్నాం. 284 పరుగుల లక్ష్యంలో నుంచి 8-9 పరుగులు మాత్రమే కుదించి, 46 ఓవర్లలో దాన్ని ఛేదించమన్నారు. ఆ నిర్ణయంతో నేను నిరాశ చెందా. ఎందుకంటే 50 ఓవర్లలో కోత పెట్టకుండా లక్ష్యాన్ని ఛేదించమంటారేమో అనుకున్నా. అనుకోకుండా నాలుగు ఓవర్లు కోసి, 8-9 పరుగులు మాత్రమే తగ్గించారు. టాస్‌ సందర్భంగా మేం అనుకున్న అంచనాలన్నీ తారుమారు అయ్యాయి" అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.

ఇక ఆ రోజు వచ్చిన ఇసుక తుపాను గురించి మాట్లాడుతూ.. "నేను ఇసుక తుపాను చూడటం అదే తొలిసారి. అక్కడున్న మొత్తాన్ని తీసుకెళ్లిపోతుందనుకున్నా. గిల్‌క్రిస్ట్‌ నాకు కుడివైపున వెనుక ఉన్నాడు. చాలా బలంగా తుపాను వచ్చింది. సామాజిక దూరాన్ని పూర్తిగా మర్చిపోయి, గిల్‌క్రిస్ట్‌ను గట్టిగా పట్టుకునేందుకు సిద్ధమయ్యా. ఎందుకంటే గంటకు 80-90 మైళ్ల వేగంతో తుపాను వచ్చింది. వెంటనే మైదానాన్ని వీడి వెళ్లాలని అంపైర్లు చెప్పారు" అని సచిన్‌ చెప్పుకొచ్చాడు. ఫైనల్లో సచిన్‌ అద్భుత శతకం చేయడం వల్ల భారత్‌ కోకో-కోలాకప్‌ను ముద్దాడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.