విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్లు శుభారంభం చేశారు. తొలి రోజు లంచ్ సమయానికి వికెట్లేమి కోల్పోకుండా 91 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(51), మయాంక్ అగర్వాల్(39) ఉన్నారు.
టెస్టుల్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. నెమ్మదిగా ఆడుతూ అర్ధశతకం సాధించాడు. ఈ క్రమంలో ఓ రికార్డు సాధించాడీ క్రికెటర్. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అత్యధిక సగటు సాధించిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ 98.22తో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో రోహిత్(91.22), ఆడమ్ వోజెస్(86.25), డగ్లస్ జర్డయిన్(81.66), జార్జ్ హెడ్లీ(77.56) ఉన్నారు.
ఇది చదవండి: అనిల్ కుంబ్లేకు మళ్లీ కోచ్ బాధ్యతలు..!