ETV Bharat / sports

'అవకాశమిస్తే టీమ్ఇండియాకు కోచ్​గా పనిచేస్తా'

భారత క్రికెట్​ జట్టుకు కోచ్​గా అవకాశం వస్తే కచ్చితంగా నిర్వర్తిస్తానని అంటున్నాడు మాజీ క్రికెటర్​ మహ్మద్​ అజారుద్దీన్​. తాజాగా ఓ ఇంటర్వ్యూ ద్వారా తన మనసులోని మాటలు వెల్లడించాడు. ఒకవేళ తాను కోచ్​గా వ్యవహరిస్తే.. బ్యాటింగ్​ కోచ్​ను ప్రత్యేకంగా నియమించాల్సిన అవసరం లేదని తెలిపాడు.

author img

By

Published : Jun 15, 2020, 7:01 PM IST

Ready to coach Team India if given an opportunity: Azharuddin
'అవకాశమిస్తే టీమ్ఇండియాకు కోచ్​గా ఉంటా'

టీమ్​ఇండియాకు కోచ్​గా అవకాశమిస్తే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు మాజీ క్రికెటర్​ అజారుద్దీన్. తాజాగా ఓ వార్తా ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను వెల్లడించాడు.

"అవును, నేను దానికి (కోచ్ పదవి) సిద్ధంగా ఉన్నా. నాకు భారత జట్టుతో కలిసి పనిచేసే అవకాశం వస్తే ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగుతా" అని తెలిపాడు అజారుద్దీన్​.

Ready to coach Team India if given an opportunity: Azharuddin
మహ్మద్​ అజారుద్దీన్​

టీమ్​ఇండియాకు ప్రస్తుతం కోచ్​గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి.. టీ20 ప్రపంచకప్​ 2021 వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు.

ప్రస్తుత కాలంలో చాలామంది సహాయక సిబ్బంది జట్లతో కలిసి ఎందుకు ప్రయాణిస్తున్నారని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అజారుద్దీన్​.

"ఈ రోజుల్లో చాలా మంది సహాయక సిబ్బంది జట్టుతో పాటు రావడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఉదాహరణకు నాకు బ్యాటింగ్​, ఫీల్టింగ్​లో అనుభవం ఉంది. అందువల్ల నేను ఏ జట్టుకైనా కోచ్​గా వ్యవహరిస్తే, నాకు ప్రత్యేకంగా బ్యాటింగ్​ కోచ్​ అవసరం లేదు" అని అజహర్ తెలిపాడు. ఈయన ప్రస్తుతం హైదరాబాద్​ క్రికెట్​ అసోసియేషన్​ (హెచ్​సీఏ) అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.

ఐపీఎల్​ యువ క్రికెటర్లకు వరం

కరోనా సంక్షోభం కారణంగా వాయిదా వేసిన ఐపీఎల్​ ఈ ఏడాది చివర్లో నిర్వహించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు అజారుద్దీన్​. యువ క్రికటర్లకు ఈ లీగ్​ ఓ చక్కటి అవకాశమని.. ఈ టోర్నీ లేకపోతే హర్దిక్​ పాండ్య, జస్ప్రీత్​ బుమ్రా లాంటి ఆటగాళ్లు ఇప్పటికీ ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో పోరాడుతూ ఉండేవారని వెల్లడించాడు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువక్రికెటర్​ వినియోగించుకోవాలని సూచించాడు.

ఇదీ చూడండి... ఎక్స్​క్లూజివ్: 'ఒలింపిక్స్​లో బంగారు పతకం సాధిస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.