ETV Bharat / sports

'రహానె సారథ్య లక్షణాలు అద్భుతం' - rahaney bowlers captain

అజింక్యా రహానెలో ప్రశాంత స్వభావం, సహ ఆటగాళ్లతో బాగా కమ్యూనికేట్​ అవ్వగల లక్షణాలు ఉన్నాయని ప్రశంసించాడు టీమ్​ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మ. ​ఈ లక్షణాలు.. ఆసీస్​తో జరగబోయే మిగతా టెస్టులకు ఓ సారథిగా అతడు జట్టును ముందుకు నడిపించడానికి తోడ్పడతాయని అన్నాడు.

rahaney
రహానె
author img

By

Published : Dec 23, 2020, 4:12 PM IST

Updated : Dec 23, 2020, 4:37 PM IST

ఆస్ట్రేలియాతో జరగబోయే చివరి మూడు టెస్టులకు తాత్కాలిక సారథిగా పగ్గాలు చేపట్టబోతున్న అజింక్యా రహానెను ప్రశంసించాడు టీమ్​ఇండియా పేసర్ ఇషాంత్​ శర్మ​. అతడి ప్రశాంత స్వభావం, ఆటగాళ్లతో కమ్యూనికేట్​ అయ్యే విధానం.. ఓ కెప్టెన్​గా తాను జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి దోహదపడతాయని చెప్పాడు. అతడి వద్ద నాయకత్వ లక్షణాలు బాగా ఉన్నాయని కితాబిచ్చాడు. కాగా, గాయంతో ఆసీస్​ పర్యటనకు దూరమయ్యాడు ఇషాంత్​.

"రహానె చాలా ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటాడు. అతడు బౌలర్ల సారథి. కోహ్లీ లేని సమయంలో మేమిద్దరం కలిసి ఆడినప్పుడు, 'నీకు ఎలాంటి ఫీల్డింగ్​ కావాలి? బౌలింగ్​ ఎప్పుడు చేయాలనుకుంటున్నావు? నీకు బౌలింగ్ చేయాలని ఉందా?' అని నన్ను అడిగేవాడు. అతనిది ఆదేశించే వ్యక్తిత్వం కాదు. జట్టు నుంచి తనకు ఏమి కావాలో ఓ స్పష్టత ఉంటుంది. తన వ్యక్తిత్వాన్ని అతడి కెప్టెన్సీలో మనం చూడొచ్చు. చుట్టూ ఉన్న ఆటగాళ్లతో చాలా సరదాగా ఉంటాడు. కఠిన పరిస్థితుల్లోనూ అందరిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపగలడు. బౌలర్లతో బాగా కమ్యూనికేట్​ అవుతాడు. దీంతో వారు కూడా ఇబ్బందికి లోనవ్వరు."

-ఇషాంత్​ శర్మ, టీమ్​ఇండియా ఫాస్ట్​ బౌలర్​.

డిసెంబరు 26న ప్రారంభం కానున్న(బాక్సింగ్​ డే) రెండో టెస్టులో ఆసీస్​-భారత్ తలపడనున్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్​లో ఆసీస్​ 1-0తో ఆధిక్యంలో ఉంది.

ఇదీ చూడండి : కోహ్లీ, రహానె కెప్టెన్సీకి అదే తేడా: సచిన్​

Last Updated : Dec 23, 2020, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.