ETV Bharat / sports

'కోహ్లీని విమర్శించే హక్కు మీకు లేదు' - కోహ్లీ ఆస్ట్రేలియా టూర్

పితృత్వ సెలవుల విషయంలో కోహ్లీపై విరుచుకుపడటం తగదని మాజీ బౌలర్ ఓజా అన్నాడు. వ్యక్తిగత జీవితాన్ని, క్రికెట్​తో కలిపి చూడకూడదని తెలిపాడు.

Pragyan Ojha slams Virat Kohli's critics for questioning his paternity leave
'కోహ్లీని విమర్శించే హక్కు మీకు లేదు'
author img

By

Published : Dec 22, 2020, 11:30 AM IST

టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీకి మాజీ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా మద్ధతుగా నిలిచాడు. పితృత్వ సెలవుల విషయమై విరాట్​ను విమర్శించే హక్కు ఎవరికీ లేదని అన్నాడు. క్రికెట్​లోకి వ్యక్తిగత జీవితాన్ని తీసుకురావడం తగదని చెప్పాడు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోహ్లీ.. తొలి టెస్టు తర్వాత స్వదేశానికి వచ్చేస్తాడు. తన భార్య అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న కారణంగా ఆమెతో పాటే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అందుకే చివరి మూడు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ పర్యటనకు ముందే చెప్పింది.

అయితే తొలి టెస్టులో భారత జట్టు దారుణంగా ఓడిపోవడం వల్ల మాజీలు, కెప్టెన్ కోహ్లీపై విమర్శిస్తున్నారు. జట్టును అలా వదిలివెళ్లడం సరికాదని అంటున్నారు. ఈ వ్యాఖ్యలపైనే ఓజా స్పందిస్తూ, కోహ్లీకి అండగా నిలిచాడు.

kohli with tim paine
ఆసీస్ టెస్టు కెప్టెన్​ పైన్​తో కోహ్లీ

ఆసీస్​పై వన్డే సిరీస్​లో 1-2 తేడాతో ఓడిన టీమ్​ఇండియా.. టీ20 సిరీస్​ను 2-1 తేడాతో గెల్చుకుంది. టెస్టు సిరీస్​లో ఆతిథ్య జట్టు తొలి మ్యాచ్​ గెలిచింది. దీంతో మెల్​బోర్న్​లో జరిగే తర్వాతి పోరులో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఎదురుచూస్తోంది. చివరి మూడు టెస్టుల కోసం రహానె తాత్కాలిక కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.