ETV Bharat / sports

అలా జరిగిన ఒకే ఒక్క భారత బౌలర్ ఓజా

author img

By

Published : Feb 23, 2020, 5:15 AM IST

Updated : Mar 2, 2020, 6:16 AM IST

తానడిన చివరి టెస్టులో ఓ అరుదైన ఘనత సాధించాడు ప్రజ్ఞాన్ ఓజా. ఇలా జరిగిన ఏకైక భారత బౌలర్​గా నిలిచాడు. ఇంతకీ అది ఏంటంటే?

అలా జరిగిన ఒకే ఒక్క భారత బౌలర్ ఓజా
భారత బౌలర్​ ప్రజ్ఞాన్ ఓజా

భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా.. ఇటీవలే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్​ ప్రకటించాడు. 2013లో చివరి టెస్టు ఆడిన ఇతడు.. ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్​లోనూ పాల్గొనలేదు. అయితే ఆ టెస్టుకు ఓ ప్రత్యేకత ఉంది.

ఈ మ్యాచ్​ దిగ్గజ సచిన్ తెందుల్కర్​కు 200వ టెస్టు. అతడికిదే చివరి అంతర్జాతీయ మ్యాచ్​. ఇందులోనే ఓజా.. రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి పది వికెట్లతో సత్తా చాటాడు. భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఆ తర్వాత అంతర్జాతీయ కెరీర్​ కొనసాగించలేకపోయాడు. చివరి మ్యాచ్​లో పది వికెట్లు తీసి, కెరీర్​కు ముగింపు పలికిన టీమిండియా ఏకైక బౌలర్ ఇతడే కావడం విశేషం.​

ojha with gambhir
గౌతమ్ గంభీర్​తో ప్రజ్ఞాన్ ఓజా

2008లో అరంగేట్రం చేసిన ఓజా.. 2013 వరకు అంతర్జాతీయ మ్యాచ్​ల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 24 టెస్టులు, 18 వన్డేలు, 8 టీ20లు ఆడాడు. టెస్టులో మొత్తంగా 113 వికెట్లు తీశాడు. దేశవాళీల్లో హైదరాబాద్ తరఫున ఆడాడు. ఐపీఎల్​లో డెక్కన్ ఛార్జర్స్, ముంబయి ఇండియన్స్​కు ఆడాడు. 2018లో బిహార్​ తరఫున చివరి ఫస్ట్​క్లాస్ మ్యాచ్​లో పాల్గొన్నాడు.

ఇప్పటివరకూ తమ చివరి టెస్టులో 7 కంటే ఎక్కువ వికెట్లు తీసిన భారత్ క్రికెటర్లు ఎవరూ లేరు. ఓజా మాత్రమే రెండు ఇన్నింగ్స్​ల్లోనూ ఐదేసి వికెట్లు తీసి సత్తాచాటాడు.

  • It’s time I move on to the next phase of my life. The love and support of each and every individual will always remain with me and motivate me all the time 🙏🏼 pic.twitter.com/WoK0WfnCR7

    — Pragyan Ojha (@pragyanojha) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Mar 2, 2020, 6:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.