ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 మ్యాచ్‌లో సత్తా చాటింది పపువా న్యూగినియా. ఈ టోర్నీ ద్వారా ఇటీవలే అమెరికా, ఒమన్ వన్డే హోదా దక్కించుకోగా... ఇప్పడు పపువా ఈ జాబితాలో చేరింది.
వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్- 2లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 155 పరుగుల తేడాతో గెలిచి ఈ ఘనత సాధించింది పుపువా జట్టు.
కెనడాకు నిరాశ...
ఈ లీగ్ మ్యాచుల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు వన్డే హోదా లభిస్తుంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో కెనడా గెలిచింది. అయితే రన్‌రేటు తక్కువగా ఉండటంతో అయిదో స్థానానికి పరిమితమై వన్డే హోదా పోగొట్టుకుంది.
- నమీబియా 151 పరుగుల తేడాతో హాంకాంగ్‌ను ఓడించి.. రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా వన్డే హోదా దక్కించుకుంది.
ఐసీసీ సీడబ్ల్యూసీ లీగ్-2 మ్యాచుల్లో ఒమన్, అమెరికా, స్కాట్లాండ్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పుపువా న్యూగినియా, నమీబియా పోటీ పడనున్నాయి. ఈ దేశాలు రెండున్నర సంవత్సరాలలో 36 వన్డేలు ఆడనున్నాయి. ఈ రెండు సంవత్సరాలు జరిగే లీగ్‌లో సత్తా చాటితే... 2023 పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది.