ప్రస్తుత బెంగుళూరు జట్టు కూర్పుపై స్పందించాడు కోచ్ సైమన్ కటిచ్. ప్రస్తుత సీజన్ కోసం 2020 నుంచే ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపాడు. 13వ సీజన్ ముగిసిన వెంటనే దేశీయ టోర్నీలపై, సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీపై దృష్టి సారించినట్లు వెల్లడించాడు. అందుకే మినీ వేలంలో ఎక్కువ మంది భారత క్రికెటర్ల కొనుగోలుకు అవకాశం లభించిందని పేర్కొన్నాడు.
"2020 ఐపీఎల్ సీజన్ ముగిసిన వెంటనే చాలా విషయాలపై సమీక్షించాం. సీజన్ మొత్తం ఎలా ఆడామనే అంశాలను సరిచూసుకున్నాం. ఇంకా ఏయే అంశాలలో మెరుగుపడాలన్న దానిపై దృష్టి సారించాం. ప్రస్తుత సీజన్ కోసం మాక్ వేలాన్ని కూడా నిర్వహించి.. అందుకు తగ్గట్లు సిద్ధమయ్యాం" అని చెప్పిన కటిచ్ వీడియోను ఆర్సీబీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
-
Bold Diaries: Head Coach Simon Katich Interview
— Royal Challengers Bangalore (@RCBTweets) April 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
On @myntra presents Bold diaries, Head Coach Simon Katich spoke about his work from home experience during the IPL auction, the gains from 2020 season, and strengthening the core group for #IPL2021.#PlayBold #WeAreChallengers pic.twitter.com/gnFw493cwe
">Bold Diaries: Head Coach Simon Katich Interview
— Royal Challengers Bangalore (@RCBTweets) April 2, 2021
On @myntra presents Bold diaries, Head Coach Simon Katich spoke about his work from home experience during the IPL auction, the gains from 2020 season, and strengthening the core group for #IPL2021.#PlayBold #WeAreChallengers pic.twitter.com/gnFw493cweBold Diaries: Head Coach Simon Katich Interview
— Royal Challengers Bangalore (@RCBTweets) April 2, 2021
On @myntra presents Bold diaries, Head Coach Simon Katich spoke about his work from home experience during the IPL auction, the gains from 2020 season, and strengthening the core group for #IPL2021.#PlayBold #WeAreChallengers pic.twitter.com/gnFw493cwe
"దేవ్‌దత్ ఫడిక్కల్ తెలివైన వాడు. ఆడుతున్న తొలి సీజన్ (2020)లోనే ఆకట్టుకున్నాడు. నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయాడు. 473 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం అతడు టీమ్ఇండియాకు టెస్టుల్లో, టీ20ల్లో ఆడుతున్నాడు. సిరాజ్, సైని బంతితో రాణిస్తున్నారు" అని కటిచ్ పేర్కొన్నాడు.
"చాలా ఏళ్ల తర్వాత గత సీజన్లో మా జట్టు ప్లేఆఫ్స్‌కు చేరింది. టీమ్‌లో చాలా సానుకూలతలు కనిపించాయి. ఎక్కువ మంది భారత యువ క్రికెటర్లకు అవకాశమివ్వడం కలిసొచ్చింది. అంతవరకు ఐపీఎల్ అనుభవం లేని ఫడిక్కల్ను టాప్ ఆర్డర్లో పంపించాల్సిందిగా నేను సూచించాను. అతడు మమ్మల్ని నిరాశ పరచలేదు. దేవ్‌దత్ తెలివైన వాడు."
-సైమన్ కటిచ్, ఆర్సీబీ కోచ్.
ప్రస్తుత జట్టు కూర్పు బాగుందని కటిచ్ అభిప్రాయపడ్డాడు. వేలంలో చాలా మంది భారత యువకులను తీసుకున్నామని.. ఇప్పుడు టీమ్ సమతూకంగా ఉందని తెలిపాడు. క్రిస్టియన్, మాక్స్వెల్, జంపా వంటి అనుభజ్ఞులైన ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: ఉత్కంఠ పోరులో చివరి బంతికి పాక్ గెలుపు