2016 ఏప్రిల్ 3.. విండీస్ జట్టు రెండోసారి పొట్టి కప్‌ను చేజిక్కించుకున్న రోజు. ఇంగ్లాండ్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన తుది పోరులో చివరికి విజయం కరీబియన్ జట్టునే వరించింది. ఈ మ్యాచ్‌లో విండీస్ ప్లేయర్ కార్లోస్ బ్రాత్‌వైట్ కొట్టిన వరుస సిక్సర్లకి.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కు దిమ్మతిరిగింది. మ్యాచ్ అనంతరం.. "పేరు గుర్తుంచుకోండి, కార్లోస్ బ్రాత్‌వైట్" అంటూ గంభీరమైన గొంతుతో ఇయాన్ బిషప్ వ్యాఖ్యానించాడు.
-
#OnThisDay in 2016, West Indies became double @T20WorldCup champions! 🏆
— ICC (@ICC) April 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
They first beat 🇦🇺 by eight wickets in the women's final, before the men trumped 🏴 by four wickets in a finale which has been quoted many times since 👇 pic.twitter.com/qDW4WkpwtC
">#OnThisDay in 2016, West Indies became double @T20WorldCup champions! 🏆
— ICC (@ICC) April 2, 2020
They first beat 🇦🇺 by eight wickets in the women's final, before the men trumped 🏴 by four wickets in a finale which has been quoted many times since 👇 pic.twitter.com/qDW4WkpwtC#OnThisDay in 2016, West Indies became double @T20WorldCup champions! 🏆
— ICC (@ICC) April 2, 2020
They first beat 🇦🇺 by eight wickets in the women's final, before the men trumped 🏴 by four wickets in a finale which has been quoted many times since 👇 pic.twitter.com/qDW4WkpwtC
చివరి ఓవర్లో కరీబియన్ జట్టుకు 19 పరుగులు అవసరం కాగా.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌కు దిగాడు. బ్యాటింగ్‌లో ఉన్న బ్రాత్‌వైట్ వరుసగా 4 బంతుల్లో 4 సిక్సర్లు కొట్టి తమ జట్టుకు రెండో టీ20 ప్రపంచకప్‌ను అందించాడు. అంతకుముందు 2012లో తొలిసారి పొట్టి కప్‌ను అందుకుంది కరీబియన్ జట్టు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు బ్రాత్‌వైట్. బౌలింగ్‌లో 3 వికెట్లు తీసుకున్న అతడు బ్యాటింగ్‌లో 34 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించాడు.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ టీమ్‌లో జో రూట్ 54, బట్లర్ 36 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్ 3 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం ఛేదనకు దిగిన కరీబియన్ జట్టు మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. శ్యాముల్స్ 85, బ్రాత్‌వైట్ 34 పరుగులతో రాణించారు.
ఇదీ చదవండి: పడిక్కల్ తెలివైన ఆటగాడు: కటిచ్