ETV Bharat / sports

'ఐపీఎల్ జరగకపోతే బోర్డు పరిస్థితి దారుణమే'

ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే, బీసీసీఐపై పరిస్థితి దారుణంగా తయారవుతుందని అన్నారు బోర్డు కోశాధికారి అరుణ్ ధుమాల్. పరిస్థితులు బట్టి లీగ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

బీసీసీఐ
బీసీసీఐ
author img

By

Published : Jun 6, 2020, 8:16 PM IST

కరోనా కారణంగా క్రికెట్​ టోర్నీలు జరగక బోర్డులు ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నాయి. పలు దేశాల బోర్డులు ఇప్పటికే ఆటగాళ్ల జీతాల్లో కోతలు విధించాయి. కానీ బీసీసీఐ మాత్రం ఇంకా అటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందరికీ పూర్తి జీతాలు చెల్లిస్తోంది. తాజాగా ఈ విషయమై స్పందించిన బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్.. ఐపీఎల్ వాయిదా పడితే పరిస్థితి దారుణంగా ఉంటుందని తెలిపారు.

"గతేడాది అక్టోబర్ నుంచి ఖర్చుల్ని తగ్గించుకున్నాం. ఆటగాళ్ల , సిబ్బంది జీతాల్లో కోతలు విధించలేదు. కానీ రవాణా, ఆతిథ్యం లాంటి విషయాల్లో కటింగ్​లు పెడుతున్నాం. ఒకవేళ ఐపీఎల్ జరగపోతే బోర్డుపై తీవ్ర ప్రభావం పడుతుంది. పరిస్థితులను బట్టి లీగ్ నిర్వహణ గురించి ఆలోచిస్తాం"

-అరుణ్ ధుమాల్, బీసీసీఐ కోశాధికారి

అంతకు ముందు ఇదే విషయంపై స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. ఐపీఎల్ జరగకపోతే రూ. 4000 కోట్ల నష్టం వస్తుందని చెప్పారు. లీగ్ నిర్వహణపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. కరోనా దెబ్బకు నిరవధిక వాయిదా పడింది. ఆస్ట్రేలియాలో అక్టోబరు-నవంబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ వాయిదా పడనుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అదే సమయంలో ఐపీఎల్​ను నిర్వహించాలని ఆలోచనలో బీసీసీఐ ఉంది. జూన్ 10న జరిగే ఐసీసీ సమావేశం తర్వాత ఈ విషయాలపై స్పష్టత రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.