ETV Bharat / sports

టీమిండియా డ్రెస్సింగ్​ రూమ్​లో ధోనీ హల్​చల్​ - india vs south africa 2019, MS Dhoni, Off The Field

భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సందడి చేశాడు. మహీ సొంత రాష్ట్రమైన రాంచీలో భారత్​-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్​ అనంతరం కోహ్లీ సేనను కలిశాడు మహీ.

టీమిండియా డ్రెస్సింగ్​ రూమ్​లో ధోనీ హల్​చల్​
author img

By

Published : Oct 22, 2019, 5:15 PM IST

టీమిండియా డ్రెస్సింగ్​ రూమ్​లో సందడి చేశాడు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ. రాంచీ వేదికగా భారత్​-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్​లో విజయం సాధించిన కోహ్లీ సేన.. సిరీస్​ను 3-0తో గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ, రవిశాస్త్రి, జట్టు సభ్యులను కలిశాడు మహీ.

ధోనీ స్వరాష్ట్రంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌ కాబట్టి తొలిరోజే మిస్టర్​ కూల్​ వస్తాడని అందరూ ఊహించారు. కానీ మూడు రోజుల వరకు మైదానంలో అడుగుపెట్టలేదు.. నాలుగోరోజు సఫారీలపై భారత్‌ 202 పరుగుల తేడాతో విజయం సాధించింది. సగర్వంగా ట్రోఫీ అందుకుంది. బహుమతి ప్రదానోత్సవం పూర్తయ్యాక.. మహీ టీమిండియా ఆటగాళ్లను కలుసుకున్నాడు.

" అద్భుత సిరీస్‌ విజయం తర్వాత తన సొంత అడ్డాలో టీమిండియా దిగ్గజాన్ని చూడటం ఎంతో బాగుంది" అని మహీని ఉద్దేశించి ట్వీట్​ చేశాడు కోచ్‌ రవిశాస్త్రి.

కోహ్లీ సమాధానం..

మ్యాచ్​ అనంతరం మీడియా సమావేశంలో ఓ విలేకరి ధోనీ గురించి విరాట్​ను ప్రశ్నించాడు. "మహీ డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే ఉన్నాడు. వచ్చి హలో చెప్పండి"అని కోహ్లీ సమాధానమిచ్చాడు. భారత్‌ తరఫున అరంగేట్రంలోనే నాలుగు వికెట్లు తీసిన ఝార్ఖండ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌తో.. మహీ ప్రత్యేకంగా ముచ్చటించాడు.

ఐసీసీ టెస్టు ఛాంపియన్​షిప్​లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్​ను 3-0 తేడాతో నెగ్గి మొదటి స్థానాన్ని పదిలం చేసుకుంది. మొత్తం 240 పాయింట్లు సాధించింది కోహ్లీసేన. వచ్చే నెల 14 నుంచి బంగ్లాదేశ్​తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచ్​లు సొంతగడ్డపై జరగనున్నాయి. ఈ కారణంగా టీమిండియా పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 22 October 2019
1. Close of door at 10 Downing Street
2. Brexit Secretary Steven Barclay entering 10 Downing Street
3. Leader of House of Commons Jacob Rees-Mogg arriving
4. Housing and planning minister Esther McVey arriving
5. Secretary of State for Environment, Food and Rural Affairs Theresa Villiers arriving
6. Foreign Secretary Dominic Raab arriving
7. Home Secretary Priti Patel arriving
STORYLINE:
Members of the British Prime Minister's cabinet arrived at Downing Street on Tuesday ahead of further votes on the country's European Union divorce bill.
Lawmakers from across the political spectrum are expected to challenge Prime Minister Boris Johnson's drive to push his European Union divorce bill through the House of Commons in three days, potentially scuttling plans to deliver Brexit by October 31.
The bill faces two votes on Tuesday, with lawmakers first being asked to approve it in principle, followed by a vote on the government's schedule for debate and possible amendments.
While many analysts expect the bill to be approved, lawmakers may reject the three-day timetable because of concerns it doesn't provide enough time for scrutiny.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.