ETV Bharat / sports

అభిమానుల కలల స్టేడియం 'మొతేరా' విశేషాలివే - మొతేరా స్టేడియం సీటింగ్ కెపాసిటీ

స్టేడియానికి వెళ్లి ఒక్క మ్యాచ్‌ అయినా ప్రత్యక్ష ప్రసారంలో చూడాలని ప్రతి అభిమానికీ ఉంటుంది. ఇక తరచుగా స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌లు చూసే వాళ్లకు ఫలానా మైదానంలో మ్యాచ్‌ చూడాలనే కలలుంటాయి. భారత్​లో ఉన్న మొతేరా స్టేడియం కూడా అలాంటిదే. మరి మొతేరా ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

Motera to be signified as world's largest cricket stadium
అభిమానుల కలగా 'మొతేరా'- స్టేడియం విశేషాలివే
author img

By

Published : Feb 21, 2021, 7:04 AM IST

ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన లార్డ్స్‌, మెల్‌బోర్న్‌ లాంటి స్టేడియాలు క్రికెట్‌ అభిమానులను ఆకర్షిస్తుంటాయి. భారత్‌ విషయానికొస్తే.. ఈడెన్‌ గార్డెన్స్‌, వాంఖడె లాంటి స్టేడియాలకు ఉన్న ఖ్యాతే వేరు. ఐకానిక్‌ స్టేడియాలుగా పేరున్న ఈ మైదానాల్లో మ్యాచ్‌లు చూడటం ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిస్తుంది. ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఈ మైదానాల్లో మ్యాచ్‌లు చూడాలని కోరుకుంటారు. అయితే ఇకపై ప్రతి భారత అభిమానీ తప్పక ఓ మ్యాచ్‌ చూడాలని కలలు కనే స్టేడియంగా మొతేరా మారిపోతే ఆశ్చర్యమేమీ లేదు. మనం లార్డ్స్‌ లాంటి స్టేడియాల గురించి మాట్లాడుకున్నట్లే ఇక నుంచి ప్రపంచం ఈ మైదానం గురించి గొప్పగా చర్చించుకోబోతుందంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా అవతరించబోతోంది.

సరికొత్త అనుభూతి పంచేందుకు...

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత ఖర్చుతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌ వీక్షణలో అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమైంది. ఇంకో మూడు రోజుల్లోనే ఈ మైదానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ జరగబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే స్టేడియాల్లో అతి పెద్దదైన ఉప్పల్‌ మైదానం ప్రస్తుత సామర్థ్యం 40 వేలు. ఆ స్టేడియంలో మ్యాచ్‌ చూసిన వాళ్లు.. లక్షా 10 వేల సామర్థ్యం ఉన్న మైదానంలో మ్యాచ్‌ చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే 'మొతేరా' ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. అంత పెద్ద స్టేడియం నిండుగా ఉండగా మ్యాచ్‌ జరిగితే, అభిమానుల అరుపులతో హోరెత్తితుంటే ఎలా ఉంటుందన్న ఊహే ఉద్వేగానికి గురి చేస్తుంది.

సామర్థ్యం ఎంతంటే?

1,00,024 సామర్థ్యంతో ఇప్పటిదాకా అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా ఉన్న ఎంసీజీ రికార్డును బద్దలు కొట్టిన మొతేరా మైదానం కోసం ఏకంగా రూ.800 కోట్లు ఖర్చు పెట్టారు. క్రికెట్‌ అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని క్రీడా మైదానాలు తీసుకుంటే.. 1,14,000 సామర్థ్యమున్న ఉత్తర కొరియా రన్‌గ్రాడో మే డే స్టేడియం తర్వాతి స్థానం మొతేరాదే. ఇంతకుముందు ఇక్కడున్న పాత స్టేడియాన్ని పునర్నిర్మించి ఇంత భారీగా తీర్చిదిద్దారు. ఇక్కడ జరిగే తొలి మ్యాచే గులాబీ బంతితో కావడం విశేషం. ఈ నెల 24 నుంచి 28 వరకు భారత్‌-ఇంగ్లాండ్‌ డేనైట్‌ టెస్టుకు మొతేరా ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు జట్ల మధ్య చివరి టెస్టు, ఆ తర్వాత అయిదు టీ20లకు కూడా మొతేరానే ఆతిథ్యమిస్తుంది. అంటే వచ్చే నెల రోజులు ఇక్కడ సందడే సందడన్న మాట!

ఇదీ చదవండి:'అభిమానులకు మరింత చేరువ కావడానికే పేరు మార్పు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.