టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్‌లోని ప్రతిభను అతడు 11 ఏళ్లున్నప్పుడే రాహుల్ ద్రవిడ్ గుర్తించాడని కేఎల్ చిన్నప్పటి కోచ్ జయరాజ్ చెప్పాడు. అండర్-13 టోర్నీలో రాహుల్ ఆటతీరు చూసి మంచి భవిష్యత్ ఉందని ద్రవిడ్ అన్నాడని తెలిపాడు.
"అండర్-13 టోర్నీలో కేఎల్ వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేయడం నాకింకా గుర్తుంది. రెండో ద్విశతకాన్ని చిన్నస్వామి స్టేడియంలో సాధించాడు. అదే సమయంలో ద్రవిడ్ అక్కడే సాధన సాగిస్తున్నాడు. ఓరోజు సెషన్ ముగిసిన అనంతరం ద్రవిడ్ వచ్చి 'ఈ అబ్బాయి బ్యాటింగ్ (డబుల్ సెంచరీలు) చూశా. అద్భుతంగా ఆడాడు. ఇతడికి మంచి భవిష్యత్తుంది. జాగ్రత్తగా చూసుకో' అని ద్రవిడ్‌తో నాతో అన్నాడు" అని జయరాజ్ తెలిపాడు.
ఇదీ చూడండి.. సునీల్ ఛెత్రిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన నెటిజన్