ప్రపంచకప్‌లో భారత్ సెమీస్‌లోనే ఓడిపోవడం వల్ల కోహ్లీ నాయకత్వంపై చర్చ మొదలైంది. విరాట్‌ను టెస్టులకు మాత్రమే పరిమితం చేసి... వన్డేలకు రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించాలని సామాజిక మాధ్యమాల్లో రచ్చ జరుగుతోంది. వీటికి తోడు విరాట్, రోహిత్ మధ్య అంతర్గత విభేదాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు సమాధానమిచ్చాడు కోహ్లీ. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో అభిమానులు మాత్రం వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని..." టీమిండియా సారథిగా కోహ్లీ స్థానాన్ని రోహిత్ భర్తీ చేయగలడా?" అని ట్విట్టర్లో ప్రశ్నించాడు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు.
-
Question Answers for 15 minutes guys.
— Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Use the hashtag #AskShoaibAkhtar
">Question Answers for 15 minutes guys.
— Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019
Use the hashtag #AskShoaibAkhtarQuestion Answers for 15 minutes guys.
— Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019
Use the hashtag #AskShoaibAkhtar
-
Kohli
— Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kohli
— Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019Kohli
— Shoaib Akhtar (@shoaib100mph) July 29, 2019
" కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తొలగించరని అనుకుంటున్నా. ఎందుకంటే అతడు చాలా విలువైన ఆటగాడు. గత 3 నుంచి 4 ఏళ్లుగా సారథిగా ఉన్నాడు. ఇప్పడు విరాట్‌కు మంచి కోచ్, ఎంపిక కమిటీ సహాయం అవసరం. అవన్నీ తగినట్టు ఉంటే కోహ్లీ నుంచి మంచి ప్రదర్శన లభిస్తుంది. రోహిత్ మంచి కెప్టెన్ అనడంలో సందేహమే లేదు. ఐపీఎల్లో తనదైన ప్రతిభ చూపించాడు. అయినప్పటికీ ఇలాంటి సున్నితమైన అంశాన్ని కదిలించకుండా కోహ్లీనే కెప్టెన్‌గా కొనసాగించాలి. విరాట్‌ను సారథిగా తప్పించాలని కోరడం నిజంగా హాస్యాస్పదం ".
--షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్
భారత జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందని వస్తోన్న వార్తలపైనా సమాధానమిచ్చాడు అక్తర్. రోహిత్ కెప్టెన్ బాధ్యతల కోసం వేచిచూస్తున్నాడని, విరాట్ ఎవ్వరినీ పట్టించుకోకుండా ఉంటున్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని అభిప్రాయపడ్డాడు పాక్ క్రికెటర్.
ఇటీవల రోహిత్ శర్మ ట్విట్టర్లో పెట్టిన ఓ సందేశం చర్చనీయాంశంగా మారింది. పెవిలియన్ నుంచి మైదానంలోకి వెళ్తున్న ఫొటోను పంచుకున్న సెంచరీల వీరడు.. "నేను ప్రతిసారీ కేవలం జట్టు కోసం కాదు.. దేశం కోసం బరిలోకి దిగుతాను"అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ విరాట్, శర్మ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలకు మరింత ఆజ్యం పోసింది.