ఈ ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేసిన ముంబయి ఇండియన్స్ యువ హిట్టర్ ఇషాన్ కిషన్‌పై ప్రశంసలు కురిపించారు టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే త్వరలోనే జాతీయ జట్టులోకి అరంగేట్రం చేస్తాడని జోస్యం చెప్పారు.
"ఐపీఎల్ 2020లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. ముంబయి జట్టులో అతడు నెం.4లో నిలకడ ప్రదర్శన చేశాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గానూ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. మొత్తంగా మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్లు మార్చడంలోనూ తనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు టీమ్ఇండియా వన్డే, టీ20 వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ స్థానానికి పోటీదారుడిగా నిలిచాడు. వికెట్ కీపింగ్‌లోనూ అతడు సత్తాచాటగలిగితే తప్పకుండా టీమ్ఇండియాకు ఆడతాడు".
-ఎమ్ఎస్కే ప్రసాద్, టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్.
ఈ ఐపీఎల్లో 14 మ్యాచ్‌లాడిన ఇషాన్.. 145.76 స్ట్రైక్‌రేట్‌తో 516 పరుగులు చేశాడు. ఇందులో 30 సిక్సర్లు ఉన్నాయి. సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ ఘనత సాధించాడు. అలానే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలోనూ అతడు ఐదో స్థానంలో నిలిచాడు.
ఇదీ చూడండి : 'మరో దారి లేదు.. ట్రేడింగ్ ద్వారానే తీసుకుంటాం'