ETV Bharat / sports

రైజర్స్ వర్సెస్ రైడర్స్... గెలుపెవరిది

ఐపీఎల్ రెండో మ్యాచ్​లో కోల్​కతా, హైదరాబాద్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. వార్నర్ రాకతో సన్​రైజర్స్​ బలంగా కనిపిస్తుండగా కార్తీక్​ సారథ్యంలోని కోల్​కతా నైట్​రైడర్స్​ మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది.

author img

By

Published : Mar 24, 2019, 8:59 AM IST

ఐపీఎల్

ఓ సారి కప్పు గెలిచి.. గత సీజన్​లో రన్నరప్​గా నిలిచిన జట్టు ఓ వైపు... రెండు సార్లు ఐపీఎల్ విజేత, ఈ సారి టైటిల్ ఫేవరెట్​గా బరిలో దిగుతున్న జట్టు మరోవైపు. ఐపీఎల్ 2019 సీజన్​ రెండో మ్యాచ్​లో నేడు సన్​రైజర్స్ హైదరాబాద్, కోల్​కతా నైట్​ రైడర్స్ తలపడనున్నాయి. కోల్​కతా ఈడెన్​ గార్డెన్స్​లో ఈ మ్యాచ్​ జరగనుంది.

ఏడాది పాటు క్రికెట్​కు దూరంగా ఉన్న వార్నర్ పునరాగమనం చేయనుండగా, ఐపీఎల్​లో సత్తా చాటి ప్రపంచకప్​లో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు దినేశ్ కార్తీక్.

ఈ రెండు జట్లు ముఖాముఖి 15 సార్లు తలపడగా కోల్​కతానే ఎక్కువ మ్యాచ్​ల్లో విజయం సాధించింది. నైట్​రైడర్స్​ 9 సార్లు గెలవగా, సన్​రైజర్స్​ 6 సార్లు నెగ్గింది. గతేడాది కోల్​కతాను ఓడించి ఫైనల్​ చేరింది హైదరాబాద్. ఈ ఏడాది కూడా దినేశ్ కార్తీక్ సారథ్యంలోనే నైట్​రైడర్స్ బరిలో దిగనుంది. హైదరాబాద్ జట్టుకు విలియమ్సన్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు.

కోల్​కతా నైట్​రైడర్స్...

బలాలు: దినేశ్ కార్తీక్ గత సీజన్​లో 498 పరుగులు చేసి జట్టును మూడో స్థానంలో నిలిపాడు. ఓపెనర్లు క్రిస్​ లిన్, సునీల్ నరైన్​ జట్టుకు అదనపు బలం. ఇద్దరూ భారీ షాట్లు ఆడగల సమర్థులు. సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్ లాంటి అత్యుత్తమ స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. మిడిల్ ఆర్డర్​లో రసెల్, బ్రాత్​వైట్ లాంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.

బలహీనతలు: పేస్ విభాగం కొంచెం బలహీనం. విండీస్ ఆల్​రౌండర్లు బ్రాత్​వైట్, రసెల్ ఉన్నప్పటికీ గత సీజన్​లో అంతగా ప్రభావం చూపలేదు.

సన్​రైజర్స్ హైదరాబాద్
బలాలు: డేవిడ్ వార్నర్ పునరాగమనం జట్టుకు కలిసొచ్చే అంశం. మార్టిన్ గప్తిల్, కేన్ విలియమ్సన్​లతో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. భువనేశ్వర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, కౌల్, ఖలీల్ అహ్మద్​లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. గత రెండు సీజన్​లలో ఆరెంజ్ క్యాప్ సన్ రైజర్స్ ఆటగాళ్లకే దక్కడం (వార్నర్, విలియమ్స్​న్) విశేషం.

బలహీనతలు: మిడిల్ ఆర్డర్ బలహీనంగా ఉంది. యూసఫ్ పఠాన్, మనీశ్ పాండే, సాహాలు ఫామ్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఓపెనర్​ శిఖర్​ ధావన్​ దిల్లీ వెళ్లగా ధావన్ స్థానంలో విజయ్ శంకర్, షాబాజ్ నదీమ్, అభిషేక్ శర్మలను తీసుకుంది సన్​రైజర్స్. వీరు ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

జట్లు..

కోల్​కతా నైట్​ రైడర్స్: దినేశ్ కార్తీక్​(కెప్టెన్​), రాబిన్ ఊతప్ప, క్రిస్​లిన్, శుభ్​మన్​ గిల్​, ఆండ్రీ రసెల్​, కార్లోస్​ బ్రాత్​వైట్​, సునీల్ నరైన్​, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్​, నిఖిల్​ యాదవ్, జోయ్​ డెన్లై, శ్రీకాంత్​ ముండే, నితిశ్ రానా, సందీప్​ వారియర్​, ప్రసిధ్ కృష్ణ, లోకీ ఫెర్గ్యూసన్​, హ్యారీ గుర్నే, కేసీ కరియప్ప, యర్రా పృథ్వీరాజ్​.

హైదరాబాద్ సన్​ రైజర్స్​: కేన్ విలియమ్సన్​(కెప్టెన్​), మనీశ్ పాండే, మార్టిన్ గప్తిల్​, రికీ భూయ్, డేవిడ్ వార్నర్​, దీపక్ హూడా, మహమ్మద్ నబీ, యూసుఫ్ పఠాన్​, షకీబ్ అల్ హసన్​, అభిషేక్ శర్మ, విజయ్ శంకర్​, శ్రీవత్స్​ గోస్వామి, బెయిర్​స్టో, వృద్ధిమాన్ సాహా, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, బసీల్ థంపీ, బిల్లి, టి.నటరాజన్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్.

మ్యాచ్ ప్రారంభం : సాయంత్రం 4 గంటలకు

RESTRICTION SUMMARY: NO ACCESS NORWAY
SHOTLIST:
NTB SCANPIX via AP - NO ACCESS NORWAY
Hustadvika - 23 March 2019
1. Various STILLS: The cruise ship Viking Sky after it sent out a Mayday signal because of engine failure in windy conditions off the west coast of Norway
STORYLINE:
Police say a cruise ship with engine problems has sent a mayday call off Norway's western coast and is making plans to evacuate its 1,300 passengers.
  
Norwegian newspaper VG said the Viking Sky cruise ship ran into propulsion problems as strong winds and heavy seas hit Norway's coastal regions on Saturday.
  
Police in the western county of Moere og Romsdal said Saturday the ship has managed to moor in Hustadsvika Bay, between the western Norwegian cities of Alesund and Trondheim.
  
Rescue teams with helicopters and boats have been sent to help and evacuate the vessel, a process expected to take several hours.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.