ETV Bharat / sports

ధోనీ ఫిట్​నెస్​పై సీఎస్​కే కోచ్ ఏమన్నాడంటే...

మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్​నెస్​పై స్పందించాడు చెన్నై జట్టు ఫీల్డింగ్ కోచ్​ రాజీవ్ కుమార్. 40 ఏళ్ల వయసులోనూ బంతిని చక్కగా అంచనా వేయగలడని కొనియాడాడు.

IPL 2021: CSK fielding coach gives update on MS Dhoni's fitness
ధోనీ ఫిట్​నెస్​పై సీఎస్కే ఫీల్డింగ్ కోచ్ ఏమన్నాడంటే?
author img

By

Published : Mar 16, 2021, 5:04 PM IST

చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్​నెస్​ గురించి అప్డేట్​ ఇచ్చాడు సీఎస్​కే ఫీల్డింగ్ కోచ్​ రాజీవ్ కుమార్. ప్రతి సెషన్​కు మహీ ఒక నిర్దిష్ట ప్రణాళికను పెట్టుకుని.. దాని ప్రకారం ఆడతాడని వెల్లడించాడు.

"ఎంఎస్​ ధోనీ ఎంత స్మార్టో తెలుసా? అతడు తన శరీరాన్ని అర్థం చేసుకుంటాడు. తన ఆటను అర్థం చేసుకుంటాడు. 40 ఏళ్ల వ్యక్తులు బంతిని సరిగా స్పష్టంగా అంచనా వేయలేరు. ధోనీ సంకల్పం చూడటానికి బాగుంది ."

-రాజీవ్ కుమార్, సీఎస్​కే ఫీల్డింగ్​ కోచ్

ఈ దఫా లీగ్​లోని అన్ని జట్ల కంటే ముందే సాధన మొదలు పెట్టింది చెన్నై. వారం క్రితం నుంచే ధోనీ, రాయుడు సహా కొత్త కుర్రాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.

గత ఐపీఎల్​లో కనీసం ప్లే ఆఫ్స్​కు చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది సీఎస్​కే. ఐపీఎల్​ చరిత్రలోనే ఇలా జరగడం తొలిసారి. బ్యాటింగ్​లోనూ ధోనీ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.

చివరిసారిగా 2020 నవంబర్​లో మైదానంలో కనిపించిన మహీ.. ఇంతకాలం క్రికెట్​కు దూరంగా ఉన్నాడు. 14వ సీజన్​కు నెల రోజుల ముందు నుంచే సాధన మొదలు పెట్టాడు.

ఇదీ చదవండి: 'పంత్, కిషన్​.. కోహ్లీని చూసి నేర్చుకోండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.