వచ్చే ఐపీఎల్లో సాఫ్ట్ సిగ్నల్ లేదు. మైదానం అంపైర్ మూడో అంపైర్‌కు నిర్ణయాధికారాన్ని ఇచ్చేటప్పుడు ఇచ్చే ఈ సిగ్నల్‌ను 2021 ఐపీఎల్లో అనుమతించరాదని బీసీసీఐ నిర్ణయించింది. మైదానం అంపైర్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మూడో అంపైర్ అత్యుత్తమ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా సాఫ్ట్ సిగ్నల్‌ను తొలగించారు.
ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌ను ఇంగ్లాండ్ ఫీల్డర్ మలన్ సరిగా అందుకున్నాడా లేదా అన్న స్పష్టత లేకపోయినా.. మైదానం అంపైర్ ఔటని సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వడం వల్ల మూడో అంపైర్ సూర్యను ఔటని ప్రకటించాడు. దీంతో విరాట్ ఈ సాఫ్ట్ సిగ్నల్ పద్ధతిని వ్యతిరేకించాడు.