ETV Bharat / sports

ఐపీఎల్​ షెడ్యూల్​పై ప్రసారదారు అసంతృప్తి! - IPL 2020 news

ఐపీఎల్​ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్న ప్రణాళికపై ప్రసారదారు స్టార్​ ఇండియా అసంతృప్తి వ్యక్తం చేసిందని ఓ అధికారి తెలిపారు. దీపావళి ఉన్న వారాంతలో టోర్నీని ముగించాలని బ్రాడ్​కాస్టర్​ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్ట్రేలియాతో జరగాల్సిన టెస్టు సిరీస్​ కోసం ఐపీఎల్​ను దీపావళి కంటే ముందే ముగించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

ipl 2020:  BCCI eyes IPL from Sept 26 to Nov 8, but broadcaster unhappy
ఐపీఎల్​ షెడ్యూల్​పై స్టార్​ ఇండియా విముఖత
author img

By

Published : Jul 20, 2020, 11:37 AM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) నిర్వహణకు తాత్కాలిక షెడ్యూల్​ను పరిశీలిస్తోంది బీసీసీఐ. సెప్టెంబరు 26 (శనివారం) నుంచి నవంబరు 8 (ఆదివారం) వరకు 44 రోజుల పాటు టోర్నీని జరపాలని భావిస్తోందట. మొత్తం 60 మ్యాచ్​లు జరగనున్నాయి.

ఈ షెడ్యూల్​పై బ్రాడ్​కాస్టర్​ స్టార్​ ఇండియా అసంతృప్తి వ్యక్తం చేస్తోందని సమాచారం. నవంబరు 14న దీపావళి ఉండగా.. ఆ వారంతం వరకు ఐపీఎల్​ కొనసాగించాలని స్టార్​ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ప్రణాళిక చేసిన షెడ్యూల్​లో మధ్యాహ్నం మ్యాచ్​ల ద్వారా రేటింగ్​లపై ప్రభావం పడుతుందని ప్రసారదారు ఆందోళన చెందుతోందని అధికారులు తెలిపారు.

ఐపీఎల్​ పూర్తయిన తర్వాత టీమ్​ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించింది బీసీసీఐ. డిసెంబరు తొలి వారంలో మొదలు కానున్న టెస్టు సిరీస్ కోసం నవంబరులోనే జట్టు బయలుదేరాల్సి ఉంది.

​"ఒకవేళ ఐపీఎల్​ నవంబరు 8న పూర్తయితే నవంబరు 10న భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సిఉంది. కరోనా వైరస్​ను దృష్టిలో ఉంచుకుని టెస్టు షెడ్యూల్​ కంటే ముందుగానే అక్కడికి చేరుకుని కొవిడ్​ టెస్ట్​లు సహా ప్రాక్టీసు మ్యాచ్​లు నిర్వహించడానికి వీలవుతుంది. వీటితో పాటు ఒక డేనైట్​ ప్రాక్టీస్​ మ్యాచ్​ జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం​" అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు.

రూ. 16 వేల కోట్లకు ఒప్పందం

ఐపీఎల్​ మ్యాచ్​లను ప్రసారం చేయడానికి ఐదేళ్ల పాటు రూ.16,347 కోట్లకు స్టార్​ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. అంటే ప్రతి ఏటా రూ.3,500 కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు బీసీసీఐకి లబ్ధి చేకూరుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.