ETV Bharat / sports

భారత్​ X విండీస్:​ వన్డే సమరానికి ఇరుజట్లు సిద్ధం - india vs west indies 2019 news

భారత్​, వెస్టిండీస్ జట్ల ​మధ్య నేడు మూడు వన్డేల సిరీస్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ను చెన్నైలోని చెపాక్​ స్టేడియంలో ఆడనున్నాయి ఇరుజట్లు. ఇప్పటికే టీ20 సిరీస్​ను చేజిక్కించుకున్న కోహ్లీసేన.. ఈ సిరీస్​లోనూ ఫేవరెట్​గా బరిలోకి దిగుతోంది.

India vs West Indies 2019
భారత్​ X విండీస్:​ 50-50 సమరానికి ఇరుజట్లు సిద్ధం
author img

By

Published : Dec 15, 2019, 5:57 AM IST

వెస్టిండీస్​తో తాడోపేడో తేల్చుకునేందుకు భారత జట్టు మరో సిరీస్​కు రెడీ అవుతోంది. ఇటీవల జరిగిన పొట్టి ఫార్మాట్ మ్యాచ్​ల్లో కోహ్లీసేన.. 2-1 తేడాతో విజేతగా నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో నువ్వా, నేనా అనే రీతిలో తలపడినా.. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. అయితే వన్డే ప్రపంచకప్‌ తర్వాత విండీస్‌ పర్యటనకు వెళ్లిన భారత్‌.. ఆతిథ్య జట్టును వాళ్ల దేశంలోనే వైట్‌వాష్‌ చేసింది. మరి దానికి కరీబియన్లు బదులిస్తారో... లేదంటే టీమిండియా చేతిలో చిత్తవుతారో త్వరలో తేలనుంది.

మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​లో భాగంగా నేడు తొలి మ్యాచ్​ చెన్నైలో జరగనుంది. కోహ్లీసేన మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. విండీస్​ జట్టు టీ20 పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

టాపార్డర్​ ఫుల్​ ఫామ్​​.. మయాంక్​ చోటే అనుమానం

విండీస్‌తో టీ20 సిరీస్‌ గెలుపొందిన టీమిండియా... ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉంది. టాపార్డర్‌లో రోహిత్‌, రాహుల్‌, కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ మోకాలి గాయం నుంచి కోలుకోకపోవడం వల్ల అతడి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితే ఇతడి వన్డే అరంగేట్రంపై సందేహం నెలకొంది. ఇందుకు కారణం ధావన్‌ లేని లోటును రాహుల్‌ భర్తీ చేస్తుండటమే.

India vs West Indies 2019
మయాంక్​

ఒకవేళ రాహుల్‌ను మిడిలార్డర్‌లో పంపిస్తే మయాంక్‌ అగర్వాల్‌ వన్డే అరంగేట్రం చేసే అవకాశముంది. లేదంటే డగౌట్​లో కూర్చోవాల్సిందే. వన్‌డౌన్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక నాలుగో స్థానంలో శ్రేయస్‌ అయ్యర్‌ రాణిస్తుండడం వల్ల అతడినే ఆడిస్తారనే నమ్మకం ఉంది.

పంత్​కు మరింత కీలకం...

ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్న యువ బ్యాట్స్‌మన్‌, కీపర్‌ రిషభ్‌పంత్‌ అటు బ్యాటింగ్‌లో, ఇటు కీపింగ్‌లో విఫలమౌతున్నాడు. జట్టు యాజమాన్యం ఎన్ని అవకాశాలు ఇచ్చినా పేలవ షాట్లతో వికెట్‌ సమర్పించుకుంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి తొలి వన్డే మరో పరీక్షగా మారింది.

India vs West Indies 2019
పంత్​

బౌలింగ్‌ విషయంలో వన్డే ప్రపంచకప్‌లో మెరిసిన చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌ చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చారు. చెన్నై పిచ్‌ స్లో బౌలర్లకు అనుకూలం కాబట్టి వీరిద్దరు ఎలా రాణిస్తారనేది ఆసక్తిగా మారింది. పేస్‌ బౌలింగ్‌లో మహ్మద్‌ షమి, దీపక్‌ చాహర్‌ తమ నైపుణ్యాలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది.

టీ20ల్లో రాణించినా వన్డేల్లో తేలిపోతారు

కరీబియన్‌ బ్యాట్స్‌మన్‌ పొట్టి క్రికెట్‌లో రాణించినంతగా వన్డేల్లో ఆడలేరు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడే బ్యాట్స్‌మెన్‌... వన్డేల్లో నిదానంగా ఆడాల్సిన అవసరం ఉంది. వికెట్‌ కాపాడుకొని స్ట్రైక్‌ రొటేట్‌ చేయాల్సి ఉంటుంది. ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ మూడో టీ20లో గాయపడినా నేటి మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. హెట్​మెయిర్‌, నికోలస్​ పూరన్‌లు పొట్టి సిరీస్‌లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు వన్డేల్లో రాణించాల్సిన అవసరం ఉంది.

సారథి పొలార్డ్​ కీలకం...

ఆల్‌రౌండర్‌ రోస్టన్‌ ఛేజ్‌ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడని తెలుస్తోంది. అతడి రాకతో విండీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ మరింత బలంగా మారుతుంది. ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడే కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ ఇప్పుడు ముందుండి నడిపించాలి. డెత్‌ ఓవర్లలో భారీ షాట్లతో అలరించే పొలార్డ్‌ ఎలా రాణిస్తాడనేది చూడాలి. బౌలింగ్‌ విభాగంలో షెల్డన్‌ కాట్రెల్‌, జేసన్‌ హోల్డర్‌, హేడెన్‌ వాల్ష్‌, విలియమ్స్‌ రాణించాల్సి ఉంటుంది.

India vs West Indies 2019
ప్రాక్టీసులో విండీస్​ ఆటగాళ్లు

15 మందితో జట్లు ఇవే..

  • భారత జట్టు:

రోహిత్​ శర్మ, కేఎల్​ రాహుల్​, విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), శ్రేయస్​ అయ్యర్​, రిషబ్​ పంత్​(కీపర్​), కేదార్​ జాదవ్​, రవీంద్ర జడేజా, దీపక్​ చాహర్​, కుల్దీప్​ యాదవ్​, యజువేంద్ర చాహల్​, మహ్మద్​ షమి

  • వెస్టిండీస్​ జట్టు:

ఎవిన్​ లూయిస్​/బ్రాండన్​ కింగ్​, షై హోప్​, షిమ్రన్​ హెట్​మెయిర్​, రోస్టన్​ ఛేజ్​, నికోలస్​ పూరన్​(కీపర్​), కీరన్​ పొలార్డ్​(కెప్టెన్​), జేసన హోల్డర్​, షెల్డన్​ కాట్రెల్​, రొమారియో షెఫర్డ్​, హెడెన్​ వాల్ష్​, అల్జారీ జోసెఫ్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Tianhe Gymnasium, Guangzhou, China - 14th December 2019
Semi-finals of the BWF World Tour Finals:
Men's Singles: Kenta Momota(Japan) beat Wang Tzu Wei(Taiwan) 21-17, 21-12
1. 00:00 Cointoss
2. 00:07 First game, game point, Kenta Momota wins 21-17
3. 00:22 Second game, Kenta Momota wins long rally to make it 9-6
4. 01:05 Second game, match point, Kenta Momota wins 21-12
Men's Doubles: Hiroyuki Endo/Yuta Watanabe(Japan) beat Marcus Gideon/Kevin Sukamuljo 21-11, 15-21, 21-10
5. 01:29 First game, game point, Endo/Watanabe wins 21-11
6. 01:41 Second game, game point, Gideon/Sukamuljo wins 21-15
7. 02:21 Third game, match point, Endo/Watanabe wins 21-10
Men's Doubles: Mohammad Ahsan/Hendra Setiawan(Indonesia) beat Lee Yang/Wang Chi-Lin(Taiwan) 21-14, 21-9
8. 02:51 Cointoss
9. 03:00 First game, game point, Ahsan/Setiawan wins 21-14
10. 03:18 Second game, match point, Ahsan/Setiawan wins 21-9
Women's Doubles: Chen Qing Chen/Jia Yi Fan(China) beat Lee So Hee/Shin Seung Chan(Korea Republic) 21-15, 21-8
11. 03:44 First game, game point, Chen/Jia wins 21-15
12. 03:59 Second game, match point, Chen/Jia wins 21-8
Women's Doubles: Mayu Matsumoto/Wakana Nagahara(Japan)  beat Yuki Fukushima/Sayaka Hirota(Japan) 13-21, 21-17, 21-9
13. 04:18 First game, game point, Fukushima/Hirota wins 21-13
14. 04:46 Second game, game point, Matsumoto/Nagahara wins 21-17
15. 05:02 Third game, match point, Matsumoto/Nagahara wins 21-9
SOURCE: Infront Sports
DURATION: 05:22
STORYLINE:
World number no.1 Kento Momota continued his march towards an 11th title of the year as he easily beat Taiwan's Wang Tzu Wei 21-17, 21-12 in 47 minutes at the semi-finals of the season-ending BWF World Tour Finals on Saturday evening.
Momota will face Indonesia's Anthony Ginting in the final on Sunday.
The men's doubles saw Japan's Hiroyuki Endo and Yuta Watanabe beating the world number one pairing of Indonesia Marcus Fernaldi Gideon and Kevin Sanjaya Sukamuljo 21-11, 15-21, 21-10 in 59 minutes.
This will be their second successive appearance at the final, where they will face another Indonesia pair of Mohammad Ahsan and Hendra Setiawan who beat Taiwan's Lee Yang and Wang Chi-Lin in straight games 21-14, 21-9 in the other semi-final contesting just 26 minutes.
In the women's doubles, China's Chen Qing Chen and Jia Yi Fan booked their place in the final after seeing off South Korea's Lee So Hee and Shin Seung Chan 21-15, 21-8 in just 39 minutes.
They will face Japan's Mayu Matsumoto andWakana Nagahara, who overcame compatriots Yuki Fukushima and Sayaka Hirota 13-21, 21-17, 21-9, in 61 minutes.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.