ఆక్లాండ్‌లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో వన్డే ఉత్కంఠగా సాగింది. టీమిండియాలోని శ్రేయస్ అయ్యర్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్లో వచ్చిన జడేజా, సైనీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
బౌలర్లపైనే భారమంతా
టీమిండియా.. ఛేదనలో 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చాడు బౌలర్ నవదీప్ సైనీ. జడేజాతో కలిసి, 49 బంతుల్లో 45 పరుగులు(5x4, 2x6) చేసి జట్టుకు ఊరట కలిగించాడు. ఆ వెంటనే జెమిసన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. రవీంద్ర జడేజా.. 75 బంతుల్ల్ 55 పరుగులు సాధించాడు. శార్దూల్, చాహల్‌లు కాసేపు కివీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ భారత్‌ను ఓటమి నుంచి తప్పించలేకపోయారు.
ఇదీ చూడండి.. కింగ్ కోహ్లీ వన్డే కెరీర్లో ఇదే చెత్త రికార్డ్!