ETV Bharat / sports

పుజారా నెమ్మదిగా బ్యాటింగ్.. మాజీల విమర్శలు

ఆసీస్​తో మూడో టెస్టులో టీమ్​ఇండియా బ్యాట్స్​మెన్ పుజారా, రహానె ఆటలో తీవ్రత లేదని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.​ అర్థం చేసుకుని పరిస్థితికి అనుగుణంగా ఆడుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

pujara
పుజారా
author img

By

Published : Jan 9, 2021, 3:26 PM IST

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్టులో టీమ్​ఇండియా ఆట తీరుపై మాజీ స్పిన్నర్​ ప్రజ్ఞాన్‌ ఓజా విమర్శలు చేశారు. పుజారా నెమ్మదిగా ఆడాడని, బ్యాటింగ్​లో ​కొంచెం వేగంగా చేసి ఉంటే బాగుండేదని అన్నాడు.

"రెండో రోజు ఆటలో వికెట్ నష్టపోకుండా 70 పరుగులు చేశారు రోహిత్, గిల్​. వారి శైలితో ఆట ముగిసే సమయానికి భారత్​ వేగం గతి తప్పింది. ఆసీస్, శనివారం​ మంచి ప్రణాళికతో బరిలో దిగింది. బౌన్సర్లతో టీమ్​ఇండియాను మానసికంగా దెబ్బతీయడంలో విజయవంతమైంది. సీనియర్​ బ్యాట్స్​మెన్​ పుజారా తన అనుభవం చూపించాల్సిన సమయంలో విఫలమయ్యాడు. అతడి బ్యాటింగ్​లో తీవ్రత కరవైంది. 2018లో భారత్​ విజయంలో అతడు కీలక పాత్ర పోషించి మనమందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. కానీ ఇప్పుడు ఆట గురించి ప్రతిఒక్కరూ ప్రశ్నించాల్సి వస్తుంది. ప్రస్తుత తరంలో క్రికెట్​ తీరు మారింది. అతడు అంత మెల్లగా ఆడకూడదు. టెస్టుల్లో క్రికెటర్ల స్ట్రైక్ రేటు ఓ స్థాయికి చేరింది. అందుకు తగినట్లు ఆడకపోతే జట్టు ఆ దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు భారత్​ విషయంలో అదే జరిగింది"

-ప్రజ్ఞాన్ ఓజా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

మరోవైపు పుజారా, రహానెకు ఆట మీద పట్టు పోయిందని టీమ్​ఇండియా మాజీ వికెట్​ కీపర్​ దీప్​ దశగుప్తా విమర్శించాడు. వారు సరైన ప్రదర్శన చేయలేకపోయారని అన్నాడు.

"పుజారా, విహారి, రహానె.. 35 ఓవర్లలో 57 పరుగులు చేశారు. బంతి పాతపడేకొద్దీ ఎక్కువ పరుగులు రాబట్టుకోవాలి. అలా చేయకపోవడం నిరాశ కలిగించింది. వారు బంతిని కొంచెం అర్థం చేసుకుని ఆడాల్సింది"

-దీప్​ దశగుప్తా, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. మూడో రోజు పూర్తయ్యేసరికి రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసి, 197 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇదీ చూడండి : సిడ్నీ టెస్టు: విఫలమైన భారత్.. ఆధిక్యంలో ఆసీస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.