ఆస్ట్రేలియాతో జరుగుతోన్న చివరి టెస్టుకు పలు మార్పులతో బరిలోకి దిగింది టీమ్ఇండియా. గాయాల బెడదతో స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా సహ హనుమ విహారి దూరమయ్యారు. దీంతో బెంచ్‌కు పరిమితమైన శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకున్నారు.
శుక్రవారం నుంచి గబ్బా వేదికగా జరుగుతోన్న నిర్ణయాత్మక మ్యాచ్‌తోనే పేసర్ టి.నటరాజన్, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ టెస్టుల్లో అరంగేట్రం చేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలోనే టీ20, వన్డేల్లో అరంగేట్రం చేసిన ఈ యార్కర్ స్పెషలిస్టు.. ఇదే పర్యటనలో టెస్టుల్లోనూ అరంగేట్రం చేయడం విశేషం. ఒకే పర్యటనలో అన్ని ఫార్మట్లలో అరంగేట్రం చేసిన ఏకైక భారత క్రికెటర్ అతడే కావడం విశేషం.
-
The stuff dreams are made of. A perfect treble for @Natarajan_91 as he is presented with #TeamIndia's Test 🧢 No. 300. It can't get any better! Natu is now an all-format player. #AUSvIND pic.twitter.com/cLYVBMGfFM
— BCCI (@BCCI) January 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The stuff dreams are made of. A perfect treble for @Natarajan_91 as he is presented with #TeamIndia's Test 🧢 No. 300. It can't get any better! Natu is now an all-format player. #AUSvIND pic.twitter.com/cLYVBMGfFM
— BCCI (@BCCI) January 14, 2021The stuff dreams are made of. A perfect treble for @Natarajan_91 as he is presented with #TeamIndia's Test 🧢 No. 300. It can't get any better! Natu is now an all-format player. #AUSvIND pic.twitter.com/cLYVBMGfFM
— BCCI (@BCCI) January 14, 2021
ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో 1-1తో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. సిడ్నీ టెస్టుగా డ్రాగా ముగిసింది. జనవరి 15న (శుక్రవారం) ప్రారంభమైన చివరి మ్యాచ్‌తో సిరీస్ ఫలితం తేలనుంది.
ఇదీ చూడండి: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్