ETV Bharat / sports

ఇండియా-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో సరికొత్త రికార్డులు - ఇండియా-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్

టీ20, వన్డే​లతో పోలిస్తే టెస్టు మ్యాచ్​లను వీక్షించే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. అయితే ఈ మధ్య సుదీర్ఘ ఫార్మాట్​ మ్యాచ్​లను చూసే వారి సంఖ్య పెరిగిందంటే నమ్మగలారా!. ఇటీవల ముగిసిన ఇండియా-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్​కు అత్యధిక వీక్షణలు వచ్చాయి. గత ఐదేళ్లలో ఇదే అధికం కావడం గమనార్హం.

India-England series records highest Test match viewership in last five years
ఇండియా-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​లో సరికొత్త రికార్డులు
author img

By

Published : Mar 19, 2021, 8:24 PM IST

Updated : Mar 19, 2021, 9:57 PM IST

ఇటీవల ముగిసిన ఇండియా-ఇంగ్లాండ్​ టెస్టు సిరీస్​.. ఓ సరికొత్త రికార్డును నమోదు చేసింది. గత ఐదేళ్లలో అత్యధిక మంది వీక్షించిన సిరీస్​గా ఇది రికార్డులు నెలకొల్పింది. నిమిషానికి సగటున 13 లక్షల మంది ఈ టెస్టు మ్యాచ్​లను చూసినట్లు వెల్లడైంది. 2019లో ఓ టెస్టు మ్యాచ్​కు ప్రారంభ రోజు అత్యధిక వీక్షణలు వచ్చాయి.

సుదీర్ఘ ఫార్మాట్​కు పెరుగుతున్న ఆదరణకు ఈ వీక్షణల సంఖ్యే నిదర్శనం. దీంతో పాటు తొలిసారిగా ప్రవేశపెట్టిన టెస్టు ఛాంపియన్​షిప్​ కూడా దీనికి మరో కారణం. ఈ టెస్టు సిరీస్​ను మొత్తం 10కోట్ల 30 లక్షల మంది చూసినట్లు వెల్లడైంది.

సుదీర్ఘ ఫార్మాట్​కు అత్యధిక వీక్షణలపై స్టార్​ స్పోర్ట్స్ ఇండియా హెడ్ సంజోగ్​ గుప్తా స్పందించారు. "టెస్టు సిరీస్​కు ఆదరణ లభించడం సంతోషంగా ఉంది. ఏడాది అనంతరం క్రికెట్​ ప్రారంభం కావడం, ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​కు క్వాలిఫై సిరీస్​లు అవడం వల్ల ఇంత మంది చూసి ఉంటారని" ఆయన తెలిపారు.​

ఇదీ చదవండి: స్లో ఓవర్​ రేట్​- ఇంగ్లాండ్ ఆటగాళ్ల ఫీజులో కోత

Last Updated : Mar 19, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.