టెస్టు సిరీస్ కోసం చెన్నైలో క్వారంటైన్లో ఉన్న టీమ్ఇండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు మూడోసారి చేసిన కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలింది. ఫలితంగా వీరందరికీ నెట్ ప్రాక్టీస్‌కు అవకాశం లభించింది. ఫిబ్రవరి 2(మంగళవారం) నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.
ఇప్పటికే ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరి బర్న్స్ తమ నిర్బంధంతో పాటు మూడు సార్లు కొవిడ్ పరీక్షను పూర్తిచేసుకొని ప్రాక్టీసును ప్రారంభించేశారు.
షెడ్యూల్ ఇదే
భారత పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలుత ఫిబ్రవరి 5 నుంచి జరిగే టెస్టుతో పర్యటన ప్రారంభం కానుంది. మొదటి రెండు టెస్టులు చెన్నైలో జరగనుండగా, మూడోదైన డేనైట్ మ్యాచ్‌తో పాటు నాలుగో టెస్టుకు అహ్మదాబాద్ (మెతేరా స్టేడియం) వేదిక కానుంది. తర్వాత టీ20 సిరీస్ కోసం ఇరుజట్లు సిద్ధమవనున్నాయి.
ఇదీ చూడండి : భారత్Xఇంగ్లాండ్: చెన్నైలో ఆధిపత్యం ఎవరిదంటే?