ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టు నాలుగో రోజు భారత్ బౌలర్లు ఆధిపత్యం చలాయిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టిన ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై విరుచుకుపడుతున్నారు. నాలుగో రోజు ఆట చివరి సెషన్లో ఇంగ్లాండ్ 30 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు వద్ద ఆడుతోంది. క్రీజులో డొమినిక్ బెస్(4), జాస్ బట్లర్ (15) ఉన్నారు. టీమ్ఇండియా బౌలర్లలో అశ్విన్(3), నదీమ్, ఇషాంత్ శర్మ, బుమ్రా తలో వికెట్ తీశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 376 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 558 పరుగులు చేయగా.. భారత్ 337 పరుగులకు ఆలౌట్ అయింది.