మొతేరా పిచ్‌పై ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి టీ20లో వికెట్ ఇలా లేదని వాపోయాడు. స్లో వికెట్‌పై తమ ఆటగాళ్లు సరిగా ఆడలేకపోయారని తెలిపాడు. పిచ్ కారణంగా తాము ఆటలో వెనుకబడ్డామని పేర్కొన్నాడు.
"మొదటి 11 ఓవర్లలో 91/2తో మంచి స్థితిలో ఉన్నాం. కానీ, ఆ తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఇది భిన్నమైన పిచ్. దీంతో మేము ఈ గేమ్‌లో వెనుకబడ్డాం. ఇది కొంత నిరాశ కలిగించింది. స్లో వికెట్ కారణంగా మేము పోరాడలేకపోయాం. పేస్ తక్కువ ఉంది. పేస్ అనేది బ్యాట్స్మెన్లకు ఎల్లప్పుడూ సవాలే. ఈ వికెట్‌పై మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నా."
-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్.
లైన్‌కు కట్టుబడి తమ ఆటగాళ్లు బౌలింగ్ చేశారని మోర్గాన్ తెలిపాడు. కానీ, భారత్ మాకంటే గొప్పగా బౌలింగ్ చేసిందని పేర్కొన్నాడు. గాయంతో రెండో టీ20కి దూరమైన బౌలర్ మార్క్ వుడ్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు మోర్గాన్. తదుపరి మ్యాచ్‌లో స్పిన్ పిచ్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ సవాళ్లన్నిటికీ మేము సిద్ధమేనని వెల్లడించాడు.
ఇదీ చదవండి: ఆ లక్ష్యంతోనే గచ్చిబౌలి స్టేడియంలో సింధు ప్రాక్టీస్!