ETV Bharat / sports

రషీద్​ ఖాన్​ భార్య​ హీరోయిన్​ అనుష్క శర్మనా? - రషీద్​ ఖాన్​

సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆల్​రౌండర్​ రషీద్​ ఖాన్ భార్య పేరు​ బాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ అనుష్క శర్మ అని గూగుల్​ చూపిస్తోంది. దీంతో అభిమానులు షాక్​ తింటున్నారు. అసలు ఎందుకిలా చూపిస్తోందంటే?

Rashid Khan
రషీద్​ ఖాన్​
author img

By

Published : Oct 12, 2020, 12:32 PM IST

సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆల్​రౌండర్​ రషీద్​ ఖాన్(అఫ్గానిస్థాన్​) సతీమణి బాలీవుడ్​ హీరోయిన్​ అనుష్క శర్మ. ఏంటి ఇది చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారా? టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ భార్య కదా ఆమె? ఇలా రాశారేంటి అనుకుంటున్నారా? అవును మీరు చూసింది నిజమే. ప్రముఖ సెర్చ్​ ఇంజిన్​ గూగుల్​లో ఇదే సమాచారం చూపిస్తోంది. కావాలంటే మీరు కూడా 'రషీద్​ ఖాన్​ వైఫ్'​ అని​ సెర్చ్​ బార్​లో టైప్​ చేస్తే అనుష్క శర్మ పేరు, ఫోటోలు కనిపిస్తాయి.

'రషీద్​ ఖాన్​ వైఫ్'​ అని గూగుల్​లో​ టైప్​ చేసే ఏమి కనపడుతోంది?

'రషీద్​ ఖాన్​ వైఫ్​'​ అని గూగుల్​ సెర్చ్​ బార్​లో టైప్​ చేయగానే తొలుత అనుష్క శర్మ పేరు కనపడుతుంది. ఆ తర్వాత రషీద్​ గురించి బయోగ్రఫీ ఉంటుంది. అందులో అతడికి పెళ్లి అయ్యిందని కనపడుతుంది. భార్య పేరు అనుష్క శర్మ అని రాసి ఉంటుంది. అయితే వీరిద్దరి వివాహ తేదీ మాత్రం విరాట్​-అనుష్క పెళ్లి తేదీ(2017 డిసెంబరు 11) అని ఉంది.

Afghan cricketer Rashid Khan's wife is Anushka Sharma
రషీద్​ ఖాన్​ భార్య స్టార్​ హీరోయిన్​ అనుష్క శర్మ

ఎందుకిలా కనపడుతోంది?

2018లో రషీద్​ తన అభిమానులతో ఇన్​స్టాలో ముచ్చటించాడు. ఆ సమయంలో ఓ అభిమాని 'మీకు ఇష్టమైన నటి ఎవరు అని అడగగా?'... 'అనుష్క శర్మ, ప్రీతి జింతా' అని బదులిచ్చాడు​. అనంతరం అతడు చెప్పిన సమాధానం బాగా వైరల్​ అయింది. ముఖ్యంగా రషీద్​-అనుష్క శర్మ పేర్లతో శీర్షికలు బాగా ప్రచురితమయ్యాయి. దీంతో ఏమైందో తెలియదు గానీ గూగుల్ మాత్రం రషీద్​ ఖాన్​ భార్య పేరు అనుష్క శర్మగా చూపించడం మొదలుపెట్టింది.

రషీద్​ ఖాన్​కు పెళ్లైందా?

రషీద్​ ఖాన్​ భార్య పేరు అనుష్క శర్మ అని రాయడం గురించి ఇంత చర్చించుకుంటున్నాము కదా. కానీ అతడికి అసలు పెళ్లే కాలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివాహం ఎప్పుడు చేసుకుంటారు అని రషీద్​ను అడగ్గా? తమ దేశ జట్టు ప్రపంచకప్ గెల్చుకున్న తర్వాతే అని స్పష్టం చేశాడు.

రషీద్​ ఖాన్​ వివరాలివి..

అఫ్గానిస్థాన్​ ఆల్​రౌండర్​ రషీద్​ ఖాన్​ 1998లో జన్మించాడు. ప్రస్తుతం ఆ దేశ జట్టుకు అతి చిన్నవయసులోనే 22 ఏళ్లకే వైస్​ కెప్టెన్​గా వ్యవహరిస్తున్నాడు. 2018లో ఆ దేశం భారత్​తో ఆడిన తొలి టెస్టులో ఇతడు చోటు దక్కించుకోవడం విశేషం. కెరీర్​లో ఆడిన నాలుగు టెస్టుల్లో 485 పరుగులు, 71 వన్డేల్లో 2467 పరుగులు, 48 టీ20ల్లో 1124 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లో కలిపి దాదాపు 200కు పైగా వికెట్లు తీశాడు.

అనుష్క శర్మ బాలీవుడ్​లో స్టార్​ హీరోయిన్​. 'బ్యాండ్​ బజా బారత్'​, 'పీకే', 'సుల్తాన్'​, 'సంజు', 'సూయి ధాగా'​ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2017లో టీమ్​ఇండియా సారథి కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇటీవల విరుష్క జోడీ, తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించి అభిమానులకు సర్​ప్రైజ్​ ఇచ్చారు.

ఇదీ చూడండి ఐపీఎల్ ఓటముల్లో దిల్లీ జట్టు సెంచరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.