ETV Bharat / sports

'నేను, ధోనీ నేలపైనే నిద్రించే వాళ్లం' - గౌతమ్ గంభీర్​

భారత మాజీ కెప్టెన్​ ధోనీతో తనకున్న జ్ఞాపకాలను షేర్​ చేసుకున్నాడు మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​. తామిద్దరం కలిసి నెల రోజులకు పైగా ఒకే గదిలో రూమ్​మేట్స్​గా ఉన్నామని.. ఒకానొక సమయంలో నేలపై నిద్రించినట్లు వెల్లడించాడు​.

Gambhir recalls sleeping on floor alongside Dhoni
'అప్పట్లో నేను, ధోనీ నేలపై నిద్రించే వాళ్లం'
author img

By

Published : Jul 13, 2020, 6:01 AM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు మాజీ క్రికెటర్​ గౌతమ్ గంభీర్​. ధోనీతో కలిసి తాను ఓ రూమ్​ షేర్​ చేసుకున్నానని తాజాగా వెల్లడించాడు. గది చిన్నదిగా ఉండటం వల్ల తామిద్దరం నేలపైనే పడుకున్నామని తెలిపాడు గంభీర్​.

"నేను, ధోనీ నెల రోజులకు పైగా ఒకే రూమ్​లో కలిసున్నాం. మాకు ఇచ్చిన రూమ్​ చాలా చిన్నదిగా ఉండేది. ఆ గదిని పెద్దదిగా, సౌకర్యవంతంగా చేసుకోవడానికి మంచాన్ని తీసేసి.. దుప్పట్లతో నేలపైనే పడుకునే వాళ్లం. అది మా ఇద్దరికీ మరిచిపోలేని జ్ఞాపకం" అని గంభీర్​ చెప్పాడు .

2004లో బంగ్లాదేశ్​తో జరిగిన మ్యాచ్​తో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు మహేంద్రసింగ్​ ధోనీ. తన కెరీర్​లో ఇప్పటివరకు 90 టెస్టులు, 350 వన్డేలు 98 టీ20ల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్​ ప్రయాణంలో 17వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు మహీ. గతేడాది జరిగిన ప్రపంచకప్​ సెమీస్​లో న్యూజిలాండ్​పై టీమ్​ఇండియా ఓటమి తర్వాత క్రికెట్​కు దూరమయ్యాడు​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.