ETV Bharat / sports

'సిరాజ్​.. టీమ్​ఇండియాకు దక్కిన ఫలితం' - సిరాజ్​పై రవిశాస్త్రి ప్రశంసలు

ఆస్ట్రేలియా సిరీస్​లో అత్యధిక ప్రత్యర్థి వికెట్లను పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్​.. టీమ్​ఇండియాకు దక్కిన ఫలితమని ప్రశంసించాడు చీఫ్​ కోచ్​ రవిశాస్త్రి. ఈ సిరీస్​లో అతడికి ఎదురైన అడ్డంకుల్ని అనుకూలంగా మలుచుకున్నాడని అన్నాడు.

siraj
సిరాజ్​
author img

By

Published : Jan 23, 2021, 9:52 AM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ టీమ్‌ఇండియాకు దక్కిన ఫలితమని చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. చరిత్రాత్మక టెస్టు సిరీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్‌పై రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.

"తన బౌలింగ్‌ దాడితో అదరగొట్టిన సిరాజ్‌ ఆసీస్‌ పర్యటన ద్వారా దక్కిన ఫలితం. వ్యక్తిగత బాధను అధిగమించి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడాడు. అడ్డంకుల్ని అనుకూలంగా మలుచుకున్నాడు" అని రవిశాస్త్రి కితాబిచ్చాడు. ఆసీస్‌ సిరీస్‌లో దొరికిన అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకున్న సిరాజ్‌ 13 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచాడు. చివరిదైన నాలుగో టెస్టులో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇదీ చూడండి : ఆటో నుంచి బీఎమ్​డబ్ల్యూ వరకు.. సిరాజ్​ శెభాష్

ఇదీ చూడండి: సిరీస్‌లో తీసిన ప్రతి వికెట్‌ నాన్నకు అంకితం: సిరాజ్‌

ఇదీ చూడండి: తండ్రి సమాధి వద్ద క్రికెటర్ సిరాజ్ భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.