సచిన్ తెందూల్కర్ - వీరేంద్ర సెహ్వాగ్.. ఈ దిగ్గజ జోడీ టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలను అందించింది. అయితే మాస్టర్‌తో మళ్లీ ఓపెనింగ్ చేయాలనుందని తన మనసులో మాట బయటపెట్టాడు వీరేంద్ర సెహ్వాగ్. ఇందుకోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 'రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్' కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని అన్నాడు.
"రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్'లో చాలా మంది దిగ్గజ ఆటగాళ్లు మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నారు. దీని కంటే పెద్ద విషయం, భద్రతపై అవగాహన పెంచడమే. ఇదో గొప్ప ముందడుగు. సచిన్‌తో ఓపెనింగ్ చేస్తూ.. బ్రెట్ లీని ఎదుర్కోవడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా" - వీరేంద్ర సెహ్వాగ్, భారత మాజీ క్రికెటర్.
అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సచిన్ - సెహ్వాగ్ చివరిగా 2012లో ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఓపెనింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో మొదటి పది ఓవర్లలోనే దాదాపు 100 పరుగులు చేసి 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించారు. విరాట్ 133 పరుగులతో 36.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సచిన్ - సెహ్వాగ్ వన్డేల్లో 93 ఇన్నింగ్స్‌ల్లో 42.13 సగటుతో 3,919 పరుగులు చేశారు. ఇందులో 12 వంద పరుగుల భాగస్వామ్యాలు ఉన్నాయి. 2002-2012 మధ్య కాలంలో ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ జోడీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఓపెనింగ్ ద్వయంగా గుర్తింపు తెచ్చుకుంది.