ETV Bharat / sports

'ప్రపంచ యుద్ధం జరిగినా ఆయన ఫామ్​ చెక్కు చెదరలేదు' - sachin wishes don bradmon

దిగ్గజ డాన్​ బ్రాడ్​మన్​ 112వ జయంతి సందర్భంగా.. ఆయనను స్మరించుకుని జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు సచిన్ తెందుల్కర్. ప్రతిఆటగాడికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అభిప్రాయపడ్డాడు.

Bradman's
బ్రాడ్​మన్
author img

By

Published : Aug 27, 2020, 6:45 PM IST

Updated : Aug 27, 2020, 6:53 PM IST

దిగ్గజ క్రికెటర్​, ఆస్ట్రేలియా మాజీ సారథి డాన్ బ్రాడ్​మన్​ 112వ జయంతి నేడు(ఆగస్టు 27). ఈ సందర్భంగా స్మరించుకుని ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు దిగ్గజ సచిన్​ తెందుల్కర్​. 1998లో బ్రాడ్​మన్​ 90వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటో దిగినట్లు తెలిపాడు.

  • Sir Don Bradman was away from 🏏 for several years due to World War II, yet has the highest Test batting average.

    Today, with concerns about athletes’ form due to uncertainties & long breaks, his career stands even taller as a source of inspiration.

    Happy birthday Sir Don. pic.twitter.com/Q735mlJMvk

    — Sachin Tendulkar (@sachin_rt) August 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రెండో ప్రపంచ యుద్ధం వల్ల డాన్​ బ్రాడ్​మన్​ చాలా ఏళ్ల పాటు క్రికెట్​కు దూరమయ్యారు. అయినా సరే టెస్టుల్లో ఆయన బ్యాటింగ్​ సగటు అందరికన్నా ఎక్కువగానే ఉంది. ఆయన జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. జన్మదిన శుభాకాంక్షలు డాన్​ సార్"

-సచిన్​ తెందుల్కర్​, భారత మాజీ క్రికెటర్

రెండో ప్రపంచయుద్ధం తర్వాత కూడా బ్రాడ్​మన్​.. ​తన కెరీర్​ను విజయవంతంగా కొనసాగించారని సచిన్ గుర్తుచేసుకున్నాడు​. కరోనా పరిస్థితులను, ప్రస్తుత అథ్లెట్లు ఎలా ఎదుర్కొవాలనేది ఆయన నుంచి ప్రేరణ పొందాలని సూచించాడు.

కెరీర్​లో 52 టెస్టులు ఆడారు బ్రాడ్​మన్​. 99.94 బ్యాటింగ్​ సగటుతో నెం.1 స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఈ రికార్డును ఏ బ్యాట్స్​మన్ కూడా అధిగమించలేకపోయాడు. 2001 ఫిబ్రవరి 25న తుదిశ్వాస విడిచారు.

ఇది చూడండి ఓపెనింగ్ ఇవ్వకపోతే ఫినిషర్​గా అదరగొడతా: రహానె

Last Updated : Aug 27, 2020, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.