ETV Bharat / sports

ఇంగ్లాండ్​ క్రికెటర్ల చొక్కాలపై కరోనా సేవకుల పేర్లు

వెస్టిండీస్​తో తొలి టెస్టు ప్రారంభానికి ముందు.. ఇంగ్లాండ్​ ఆటగాళ్లు ప్రాక్టీస్​లో కొవిడ్​ సేవకుల పేర్లతో కూడిన చొక్కాలు ధరిస్తారని ఆ దేశ క్రికెట్​ బోర్డు తెలిపింది. కరోనా కాలంలో నిస్వార్థ సేవలందిస్తోన్న వారి గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

England players to honour key workers with names on training shirts Reuters | Jun 22, 2020, 15:55 IST
ఇంగ్లాండ్​ క్రికెటర్ల చొక్కాలపై కరోనా సేవకుల పేర్లు
author img

By

Published : Jun 23, 2020, 5:29 AM IST

కరోనా కాలంలో విశేష సేవలందిస్తోన్న వారిని గౌరవిస్తూ ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్టు(ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో వెస్టిండీస్​తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​కు ముందు ఇంగ్లాండ్​ ఆటగాళ్లు ప్రాక్టీస్ సమయంలో కొవిడ్​ సేవకుల పేర్లతో కూడిన చొక్కాలను ధరిస్తారని వెల్లడించింది.

స్థానిక క్రికెట్​ క్లబ్​ల ద్వారా చొక్కాలపై ఉన్న పేర్లకు సంబంధించిన వ్యక్తులను నామినేట్​ చేసినట్లు ఈసీబీ తెలిపింది. వీరిలో ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, సామాజిక కార్యకర్తలు తదితరులు ఉన్నట్లు పేర్కొంది.

"మేము ఎంతగానో ఇష్టపడే క్రికెట్​ ఆడే సమయంలో.. క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం నిరంతరం శ్రమిస్తున్న ధైర్యవంతులైన కొవిడ్​ సేవకులను గౌరవించడానికి సమయం కేటాయించాలనుకుంటున్నాం. వారిని గౌరవించడానికి దీనిని మంచి అవకాశంగా భావిస్తున్నాం. వారి పేర్లను మేము గర్వంగా ధరిస్తాం."

-జోరూట్, ఇంగ్లాండ్​ కెప్టెన్​

కరోనా కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ క్రికెట్​.. సుదీర్ఘకాలం తర్వాత పునఃప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మొదటి టెస్టు సిరీస్​ జులై8న సౌతాంప్టన్​లో జరగనుండగా.. చివరి రెండు మ్యాచ్​లు ఓల్డ్​ ట్రాఫోర్డ్​లో నిర్వహించనున్నారు. కొవిడ్​ సేవకుల గౌరవార్థం ఈ సిరీస్​ను 'రైస్​ ద బ్యాట్'​ టెస్టు సిరీస్​గా పిలవనున్నట్లు ఐసీబీ తెలిపింది.

England players to honour key workers with names on training shirts Reuters | Jun 22, 2020, 15:55 IST
ఈసీబీ

"ప్రస్తుతం క్రికెట్​ పునఃప్రారంభించడం అంటే సవాలుతో కూడుకున్న ప్రయాణం. 'రైస్ ​ద బ్యాట్'​ టెస్టు సిరీస్​ ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని నింపుతుందని భావిస్తున్నాం."

-హారిసన్, ఈసీబీ సీఈఓ ​

బ్రిటన్​లో ఇప్పటివరకు 3లక్షల మందికిపైగా కరోనా సోకింది. 42 వేలకు పైగా మహమ్మారి బారిన పడి మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.