నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన తనకు భారత జట్టులో అవకాశం వస్తుందని ఊహించలేదని పేసర్ నటరాజన్ పేర్కొన్నాడు. ప్రారంభ సిరీస్‌లోనే అదరగొట్టిన నట్టు.. జట్టులో చోటు దక్కిందనగానే ఎంతో ఒత్తిడికి లోనైనట్టు తెలిపాడు.
ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ అరంగ్రేటం చేసిన ఏకైక భారత ఆటగాడిగా నటరాజన్ చరిత్ర సృష్టించాడు. తొలి మ్యాచ్‌ను డిసెంబర్ 2న కాన్బెర్రాలో జరిగిన మూడో వన్డేలో ఆడిన నట్టూ.. సుదీర్ఘ ఫార్మాట్లోకి మాత్రం చివరిదైన నాలుగోవ టెస్టులో అడుగుపెట్టాడు.
నా కర్తవ్యం నిర్వహించడం ఆనందంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశం వస్తుందని ఊహించలేదు. ఆ విషయం తెలిసినప్పుడు ఒత్తిడికి లోనయ్యాను. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. ఇండియాకు ఆడి.. వికెట్లు సాధించాలనేది నా కల. అది నిజమైంది.
-నటరాజన్, భారత పేసర్.
"ఇండియాకు ఆడడంపై నా సంతోషాన్ని మాటాల్లో చెప్పలేను. కోచ్‌లు, తోటి వారి నుంచి మద్దతు లభించింది. వాళ్లు నన్నెంతో ప్రోత్సహించారు. వాళ్లు వెన్నంటే నిలవడం వల్లే నేను మెరుగ్గా ఆడగలిగాను," అని నట్టు పేర్కొన్నాడు.
విరాట్, రహానేలు తనలో సానుకూల దృక్పథం నింపారని ఈ 29ఏళ్ల పేసర్ అభిప్రాయపడ్డాడు. ఇరువురి సారథ్యంలో ఆడటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.
ఇదీ చదవండి: 'వారసత్వ రాజకీయంపై భాజపా ఆ చట్టం తేగలదా?'