ETV Bharat / sports

'డ్రెస్సింగ్​​ రూమ్​ను మిస్​ అవుతున్నా' - భారత్​ vs ఇంగ్లాండ్​ వార్తలు

చెన్నై వేదికగా ఇంగ్లాండ్​తో జరగనున్న టెస్టు సిరీస్​లో తాను ఆడకపోవడం చాలా నిరాశ కలిగించిందని టీమ్ఇండియా పేసర్​ టి.నటరాజన్​ అన్నాడు. ఆరు నెలలుగా వరుస పర్యటనలతో బిజీగా ఉన్న నట్టూ​.. ప్రస్తుతం తన కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. డ్రెస్సింగ్​ రూమ్​ను చాలా మిస్​ అవుతున్నట్లు తెలిపాడు.

Definitely missing being part of squad, Says T Natarajan
'డ్రస్సింగ్​ రూమ్​ను మిస్​ అవుతున్నా.. ఆదొక్కటే నిరాశ!'
author img

By

Published : Feb 2, 2021, 2:03 PM IST

Updated : Feb 2, 2021, 2:08 PM IST

ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి రెండు టెస్టులకు టీమ్​ఇండియా యువ పేసర్​ టి.నటరాజన్ దూరంగా ఉండనున్నాడు. ఆరు నెలలుగా సుదీర్ఘ పర్యటనలో ఉన్న నటరాజన్​.. ప్రస్తుతం కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా డ్రెస్సింగ్ రూమ్​ను చాలా మిస్​ అవుతున్నట్లు తెలిపాడు.

"కొన్ని నెలలుగా పర్యటనలతో బిజీగా ఉండటం వల్ల ప్రస్తుతం డ్రెస్సింగ్​ రూమ్​ను మిస్​ అవుతున్నా. కానీ, ఇదే సమయంలో బ్రేక్​ తీసుకోవడం అవసరమని నాకు తెలుసు. ఆరునెలలుగా నా కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించలేకపోయా. కాబట్టి ఈ విశ్రాంతికి సంతృప్తిగా ఉన్నా. అదే విధంగా చెన్నైలో ఇంగ్లాండ్​తో ఆడునున్న మ్యాచ్​లో నేను ఆడకపోవడం వల్ల కొంత నిరాశకు లోనయ్యా."

- నటరాజన్​, టీమ్​ఇండియా పేసర్​

భారత్​ తరఫున జాతీయ జట్టులో అవకాశం దక్కించుకోవడం సహా.. తనపై పడే పనిభారాన్ని తగ్గించుకునేందుకు తగిన విధంగా సమయాన్ని సర్దుబాటు చేసుకుంటున్నానని నటరాజన్​ అన్నాడు. "జాతీయ జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతూనే నాపై ఉన్న పనిభారాన్ని తగ్గించుకునేందుకు చూసుకుంటా. రాబోయే మ్యాచ్​ల కోసం ఓర్పుతో ప్రాక్టీసు చేస్తా. నా జీవితంలో ఆరు నెలలు నిర్విరామంగా క్రికెట్​కు సమయాన్ని వెచ్చించడం ఇదే తొలిసారి. లాక్​డౌన్​లో బాగా ప్రాక్టీసు చేశాను. దాని వల్ల ఐపీఎల్​, ఆస్ట్రేలియా పర్యటనకు పనిభారాన్ని తగ్గించుకునేందుకు సహాయపడింది" అని తెలిపాడు నట్టూ.

ఇదీ చూడండి: గిల్​.. ఓ లెజెండ్​ క్రికెటర్​గా ఎదుగుతాడు: హాగ్​

Last Updated : Feb 2, 2021, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.