బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మరోసారి విజృంభిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా పులులను ఆరంభంలోనే దెబ్బతీసింది. తొలి సెషన్ ముగిసే సమయానికి ప్రత్యర్థి జట్టులోని టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపారు టీమిండియా బౌలర్లు. ఇషాంత్, ఉమేశ్, షమి తలో వికెట్ తీశారు.
-
That will be Lunch on Day 1 of the 1st @Paytm #INDvBAN Test.
— BCCI (@BCCI) November 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Bangladesh 63/3 https://t.co/0aAwHDwHed pic.twitter.com/6RSYgCyMlv
">That will be Lunch on Day 1 of the 1st @Paytm #INDvBAN Test.
— BCCI (@BCCI) November 14, 2019
Bangladesh 63/3 https://t.co/0aAwHDwHed pic.twitter.com/6RSYgCyMlvThat will be Lunch on Day 1 of the 1st @Paytm #INDvBAN Test.
— BCCI (@BCCI) November 14, 2019
Bangladesh 63/3 https://t.co/0aAwHDwHed pic.twitter.com/6RSYgCyMlv
12 పరుగులకే ఓపెనర్ ఇమ్రుల్ కేయుస్(6) వికెట్ తీసి దెబ్బతీశాడు ఇషాంత్ శర్మ. కాసేపటికే మరో ఓపెనర్ ఇస్లామ్‌ను(6) ఔట్ చేసి బంగ్లాను కష్టాల్లో పడేశాడు ఉమేశ్ యాదవ్. అనంతరం క్రీజులో నిలదొక్కుకుంటున్న మిథున్‌ను(13) ఎల్బీడబ్ల్యూ చేశాడు షమి.
ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ మోమినుల్ హక్(22), ముష్ఫికర్ రహీమ్(14) ఉన్నారు. నిలకడగా ఆడుతూ బంగ్లా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లంచ్ విరామానికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.
ఇదీ చదవండి: టైమ్ మ్యాగజైన్ '100 నెక్స్ట్' జాబితాలో ద్యుతికి చోటు